సకాలంలో ఆపద్బాంధులా ఆదుకుంటున్న అంబులెన్స్
● ఉమ్మడి జిల్లాలో 71 సర్వీసులు
● బాధితులు, క్షతగాత్రులు ఆస్పత్రులకు తరలింపు
● ఏడాదిలో 81,546 మందికి అత్యవసర వైద్యసేవలు
ఉమ్మడి జిల్లాలో వాహనాలు..
నాగర్‌కర్నూల్ 19
వనపర్తి
13
జో,గద్వాల
11
మహబూబ్‌నగర్ 17
నారాయణపేట: ఆపద సమయంలో ఆప్తులు వస్తారో రారోగానీ 108 వాహనాలు మాత్రం కుయ్ కుయ్‌మంటూ వచ్చేస్తున్నాయి. 108కి ఫోన్‌చేస్తే చాలు మేమున్నామంటూ భరోసానిస్తూ ఘటనా స్థలానికి చేరుకొని బాధితులు, క్షతగాత్రులను సకాలంలో ఆస్పత్రికి తరలిస్తూ ప్రాణాలు కాపాడుతున్నాయి. 108 వాహనాన్ని చూడగానే దివంగత వైఎస్సార్ గుర్తుకు వస్తున్నారని బాధితులు చెబుతున్నారు. రోడ్డు ప్రమాదం, పురిటి, చాతి నొప్పి, ఫిట్స్, పాయిజన్, పాము కాటు తదితర అత్యవసర సమయాల్లో ఒక్క ఫోన్ చేస్తే వాహనం ముందుంటుందని చెప్పవచ్చు. ఈ వాహన సేవలతో ప్రాణాలు నిలిచినవారు ఎందరో ఉన్నారు.
81,546 మంది
వినియోగం..
గతేడాది మార్చి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు ఉమ్మడి జిల్లాలోని 71 వాహనాల్లో 81,546 మందిని సకాలంలో ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించి ప్రాణాలు కాపాడిన సిబ్బంది ప్రజల మన్ననలు పొందారు.
అత్యవసర వైద్యసేవలు..
108కు ఫోన్ చేసిన 15 నిమిషాల్లో వాహనం ఘటనా స్థలానికి చేరుకొని అత్యవసర ప్రథమ చికిత్స అందిస్తూ దగ్గరలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడుతున్నాయి. వాహనంలో ఉన్న నిష్ణాతులైన టెక్నీషియన్లు ప్రమాద పరిస్థితిని బట్టి అవసరమైన వైద్యం, ఆక్సిజన్ అందిస్తూ బాధితులకు భరోసా కల్పిస్తున్నారు. పలువురు గర్భిణులకు వాహనంలోనే ప్రసవాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అత్యుత్తమ వైద్యసేవల కోసం మహబూబ్‌నగర్, హైదరాబాద్ తదితర ఆస్పత్రులకు వాహనాల్లో తరలిస్తూ సేవలు అందిస్తున్నారు.
కేసులు బాధితులు
ప్రసవాలు 18,739
అత్యవసర వైద్యసేవలు 14,900
రోడ్డు ప్రమాదాలు 8,712
కడుపునొప్పి 8,445
శ్వాసకోస సమస్యలు 6,464
అంతర్గత కారణాలతో 4,740
గుండె సంబంధిత సమస్యలు 4,734
అపస్మారక స్థితి 4,103
పురుగుమందు తాగినవారు 3,515
మూర్చ వ్యాధిగ్రస్తులు 2,638
ఆత్మహత్య 1,790
వన్యప్రాణుల ప్రమాదాలు 1,527
పక్షవాతం 1,003
అగ్నిప్రమాదాలు 230
ఉమ్మడి జిల్లాలో ఇలా..


