బీమాతో భరోసా | - | Sakshi
Sakshi News home page

బీమాతో భరోసా

Apr 5 2026 9:30 AM | Updated on Apr 5 2026 9:30 AM

స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం చేయూత

వీరే అర్హులు..

గ్రామీణ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ పరిధిలో 18– 59 సంవత్సరాల వయస్సు కలిగి, స్వయం సహాయక సంఘంలో సభ్యురాలిగా ఉన్న వారికి ఈ బీమా పథకం వర్తించనుంది. మహిళా సంఘం సభ్యురాలు సహజ మరణం చెందితే, వారు తీసుకున్న రుణం మాఫీ కానుంది. అదే సీ్త్రనిధి, బ్యాంకు రుణాలు తీసుకున్న మహిళా సంఘం సభ్యురాలు ప్రమాదవశాత్తు మరణిస్తే ప్రభుత్వం ద్వారా అందించే రూ.10 లక్షల బీమా సొమ్ము నామినీ ఖాతాలో జమ అవుతోంది. దీంతోపాటు వారు తీసుకున్న రుణాన్ని సైతం మాఫీ చేస్తారు. 50 శాతానికి మించి అంగవైకల్యం ఏర్పడితే, సదరం ధ్రువీకరణ పత్రాన్ని పరిశీలించి రూ.5 లక్షలు అందించనున్నారు.

అచ్చంపేట: మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించడంతోపాటు కుటుంబ ఆర్థిక ప్రగతికి వెన్నెముఖగా నిలుస్తున్న స్వయం సహాయక సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం చేయూతనిస్తోంది. వారి జీవితాలకు మరింత భద్రత కల్పిస్తూ.. ప్రమాద బీమా పథకాన్ని 2029 వరకు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దురదృష్టవశాత్తూ ఎవరైన సభ్యురాలు ప్రమాదంలో మరణిస్తే బాధిత కుటుంబానికి ఏకంగా రూ.10 లక్షల బీమా పరిహారం అందించడంతో పాటు అమె పేరిట ఉన్న రుణాన్ని కూడా పూర్తిగా మాఫీ చేయనుంది. గతంలో కుటుంబ సభ్యులు చెల్లించలేని పరిస్థితి ఉంటే గ్రూపు సభ్యులే ఆ రుణభారం భరించాల్సి వచ్చేది. ఇదీ కాక ఏదేని కారణంతో సభ్యురాలు బ్యాంకు రుణం చెల్లించకపోతే ఆ భారం ఇతర సభ్యులపై పడటం, వారు కూడా చెల్లించలేని పక్షంలో బ్యాంకులు ఆయా సంఘాలను బ్లాక్‌ లిస్టులో చేర్చడం వంటివి చేసేవారు. దీంతో కొత్త రుణాలు మంజూరు కాక చాలా సంఘాలు ఇన్‌ యాక్టివ్‌గా మారేవి. ఈ అవస్థలకు చెక్‌ పెట్టే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌హెచ్‌జీ మహిళలకు భరోసానిచ్చే ఈ తాజా నిర్ణయంతో మహిళా సంఘాల సభ్యుల్లో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

సభ్యులు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10 లక్షలు

రక్షణ కవచంగా నిలుస్తున్న లోన్‌ బీమా పథకం

పథకాన్ని 2029 వరకు పొడిగిస్తూ కీలక నిర్ణయం

క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్న అధికారులు

మండల సమాఖ్యలు

20

వికలాంగుల సంఘాలు

457

మొత్తం సభ్యులు

1,47,123

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement