సూచనలు పాటిస్తేనే..
సాధారణంగా నవంబర్ నెల వరకు తోటలను బెట్టగా ఉంచాలి. కానీ, ఈసారి రైతులు ముందస్తుగానే సాగు ప్రక్రియకు శ్రీకారం చుడుతున్నారు. కాపు ముందుగా కాసేందుకు ఇది ఉపయోగపడుతుంది. క్రమపద్ధతిలో సాగు చేపట్టకుంటే ఎన్ని మందులు వేసినా లాభం ఉండదనే విషయాన్ని రైతులు గుర్తించాలి. సాగు విధానంలో ఉద్యాన అధికారుల సూచనలు పాటిస్తేనే సరైన దిగుబడులు సాధించవచ్చు.
– లక్ష్మణ్, ఉద్యానవన శాఖాధికారి
మామిడి పంటకు ముందస్తు కాపు వస్తేనే రైతులకు లాభం. జనవరి నుంచి మార్చి నెలాఖరు వరకు మామిడికి మార్కెట్లో మంచి ధరలు ఉండి.. తర్వాత భారీగా తగ్గిపోతాయి. ఆలస్యంగా పంట వస్తే ధరలు కూడా ఉండవు. రూ.లక్షలు ఖర్చు పెట్టి తోటలు కౌలుకు తీసుకునే రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. అందుకే ముందస్తు కాపు కోసం రైతులు ముందుగానే తోటలను సిద్ధం చేసుకుంటున్నారు.
– బాలచంద్రుడు, మామిడి రైతు, కొల్లాపూర్
●
సూచనలు పాటిస్తేనే..


