
పార్టీ కోసం కష్టపడే వారికే ప్రాధాన్యం
కొల్లాపూర్/అచ్చంపేట: కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కృషితోనే రాష్ట్రంలో అధికారం చేపట్టామని.. పార్టీ కోసం కష్టపడిన వారికి తగిన గుర్తింపు ఉంటుందని ఏఐసీసీ పరిశీలకులు, పుదుచ్చేరి మాజీ సీఎం నారాయణస్వామి అన్నారు. డీసీసీ అధ్యక్ష ఎన్నిక అంశంపై చర్చించేందుకు సోమవారం కొల్లాపూర్, అచ్చంపేట పట్టణాల్లో ఏర్పాటుచేసిన నియోజకవర్గ స్థాయి సమావేశాలకు నారాయణస్వామి, రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏఐసీసీ పరిశీలకుడు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పాటుపడే కార్యకర్తలకు పార్టీ పదవులు, నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యం ఉంటుందన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్ల అంశంలో బీజేపీ, బీఆర్‌ఎస్ కుట్రలు చేశాయని ఆరోపించారు. వారి కుట్రలను ప్రజలకు తెలియజేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. అనంతరం డీసీసీ అధ్యక్ష పదవి, స్థానిక ఎన్నికల టికెట్లు ఆశిస్తున్న వారి నుంచి దరఖాస్తులు స్వీకరించారు. సమావేశంలో ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మ న్ రాజేందర్, టీపీసీ పరిశీలకుడు అమీర్ అలీఖాన్, సంధ్యారెడ్డి, జగత్‌రెడ్డి, పగిడాల శ్రీనివాసరెడ్డి, నాగరాజు, రాజశేఖర్‌గౌడ్, ఎక్బాల్, నర్సింహ, రహీంపాషా, ధర్మతేజ, కృష్ణ ఉన్నారు.