
వైద్యులు అందుబాటులో ఉండాలి
లింగాల: ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ తారాసింగ్ సూచించా రు. లింగాల కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో సోమ వారం ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించడంతో పాటు ఓపీ వివరాలను తెలుసుకున్నారు. వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వైద్యసేవలపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీహెచ్‌సీకి వచ్చే గర్భిణులు, రోగులను పూర్తిగా పరీక్షించి చికిత్సలు అందించాలని.. అత్యవసరమైతేనే అచ్చంపేట లేదా నాగర్‌కర్నూల్ ఆస్పత్రులకు రెఫర్ చేయాలన్నారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. విధులపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.