
సైబర్ నేరాలపైఅవగాహన తప్పనిసరి
నాగర్‌కర్నూల్ క్రైం: జిల్లాలోని సైబర్ వారియర్స్ సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన పెంచాలని ఎస్పీ గైక్వాడ్ వైభవ్‌రఘునాథ్ అన్నారు. మంగళవారం ఎస్పీ కార్యాలయంలో జిల్లాలో 22 పోలీస్‌స్టేషన్‌లో ఉన్న సైబర్ వారియర్స్ కానిస్టేబుళ్లకు డీజీపీ కార్యాలయం నుంచి వచ్చిన సైబర్ వారియర్స్ టీషర్ట్‌లను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో పోలీసుశాఖ ఆధ్వర్యంలో పాఠశాలలు, కళాశాలలు, ఇతర ప్రాంతాల్లో సైబర్ నేరాలపై జరిగే కార్యక్రమాల్లో సైబర్ వారియర్స్ టీషర్టులను ధరించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. మారు తున్న కాలానికి అనుగుణంగా సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని, ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో డీసీఆర్బీ సీఐ ఉపేందర్‌రావు, ఎస్బీసీఐ కనకయ్య, ఎస్‌ఐ ఉమాదేవి పాల్గొన్నారు.
భ్రూణ హత్యలు
నివారించేందుకు కృషి
నాగర్‌కర్నూల్ క్రైం: జిల్లాలో ఎక్కడయినా భ్రూణ హత్యలకు పాల్పడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, భ్రూణ హత్యలు నివారించేందుకు కృషి చేయాలని ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓ డా.రవికుమార్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ, సంక్షేమ శాఖ సంయుక్తంగా మహిళా సాధికారతలో భాగంగా ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తలకు, అంగన్‌వాడీ టీచర్లకు లింగ వివక్ష, లింగ నిర్ధారణ పరీక్ష నిషేధ చట్టం, ఎయిడ్స్‌పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ జిల్లాలోని కొన్ని మండలాల్లో ఆడ శిశువుల నిష్పత్తి తగ్గిందని, ప్రస్తుతం వెయ్యి మంది మగ పిల్లలకు 892 మంది ఆడ శిశువులు జన్మిస్తున్నారని, రాష్ట్ర సరాసరి 939 తో పోల్చుకుంటే చాలా తక్కువగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది ఆడ శిశు భ్రూణ హత్యలను నివారించి, లింగ నిర్ధారణ పరీక్ష నిషేధ చట్టం అమలుకు సహకరించాలని కోరారు. ఎవరైనా గర్భిణులకు స్కానింగ్ చేసి లింగ నిర్ధారణ చేస్తే 85008 79884 నంబర్‌కు ఫోన్, వాట్సాప్ ద్వారా సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వ్యత్యాసం చూపొద్దు
తల్లిదండ్రులు ఆడపిల్లలు, మగపిల్లల మధ్య వ్యత్యాసం చూపకుండా అన్నింటిలో సమాన అవకాశాలు కల్పించాలని జిల్లా సంక్షేమ అధికారిణి రాజేశ్వరి మాట్లాడుతూ కోరారు. సమాజంలో బాలికల లింగ నిష్పత్తి పెంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రోగ్రాం అధికారి డాక్టర్ శివకుమార్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ (ఆరోగ్య ఉపకేంద్రం)లో హెచ్‌ఐవీ పరీక్ష కిట్లు అందుబాటులో ఉన్నాయని, అవసరమైన వారికి హెచ్‌ఐవీ పరీక్షలు చేయించాలన్నారు. వ్యాధి నిర్ధారణ అయి న వారికి ఆంటీ రిట్రో వైరల్ చికిత్స ఇప్పించడం వలన హెచ్‌ఐవి వ్యాధిని అరికట్టవచ్చని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా డిప్యూటీ మాస్ మీడియా అధికారి రాజగోపాలచారి, సోషల్ ఆక్టివిస్ట్ హైందవరెడ్డి పాల్గొన్నారు.
భూ నిర్వాసితులకునష్టపరిహారం చెల్లించాలి
కోడేరు: పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా రిజర్వాయర్‌లో భూము లు కోల్పోయిన మండలంలోని తీగలపల్లి రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పర్వతాలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. దశాబ్ద కాలం గడిచినా భూ నిర్వాసితులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించకపోవడం సరికాదన్నారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు ప్రస్తుతం ఉన్న మార్కెట్ విలువకు మూడు రెట్లు నష్టపరిహారం చెల్లించాలని కోరారు. అదే విధంగా వృద్ధులు, వితంతువులకు నేటికీ ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేయపోవడంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నర్సింహ, సీపీఎం మండల కార్యదర్శి రవి, రామయ్య, వల్లి తదితరులు పాల్గొన్నారు.

సైబర్ నేరాలపైఅవగాహన తప్పనిసరి

సైబర్ నేరాలపైఅవగాహన తప్పనిసరి