
అక్రమ కేసులకు భయపడేది లేదు
● బీఆర్‌ఎస్ ధర్నాలో మాజీమంత్రిశ్రీనివాస్‌గౌడ్ డిమాండ్
సాక్షి, నాగర్‌కర్నూల్: తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది ఎకరాలకు సాగునీరందించే కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెట్టేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నుతోందని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మంగళవారం మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అధ్యక్షతన జిల్లాకేంద్రంలో ర్యాలీ నిర్వహించి.. అంబేడ్కర్ చౌరస్తాలో యూరియా కొరత, కేసీఆర్‌పై సీబీఐ అక్రమ కేసును నిరసిస్తూ బీఆర్‌ఎస్ చేపట్టిన ధర్నాలో మాజీమంత్రి పాల్గొని మాట్లాడారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై అక్రమంగా సీబీఐ కేసులు పెడితే తాము భయపడేది లేదని చెప్పారు. కేవలం ఐదేళ్ల కాలంలో చిత్తశుద్ధితో ప్రాజెక్టును పూర్తిచేసిన ఘనత కేసీఆర్‌దే అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డలోని పిల్లర్లు కుంగిపోతే ప్రాజెక్టుపైనే రాద్ధాంతం చేస్తూ కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం యూరియా విషయంలో పూర్తిగా విఫలమైందన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రైతులకు సక్రమంగా యూరియా అందించాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్లకాలం పడిన కష్టాన్నంతా కాంగ్రెస్ గంగలో కలిపేస్తోందని విమర్శించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్ సత్తా చూపిస్తామన్నారు. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ గత బీఆర్‌ఎస్ పాలనలో ఏనాడూ యూరియా కష్టాలను చూడలే దన్నారు. ఆటో డ్రైవర్లతో డబ్బులు పంపిస్తే యూరి యా బస్తాలు ఇంటికి చేరేవని గుర్తుచేశారు. కాంగ్రెస్ పాలనలో రోజుల తరబడి క్యూలో ఉంటే టోకె న్లు ఇస్తున్నారని, ఒక కుటుంబానికి ఒక బస్తా మాత్రమే ఇస్తున్నారని ఆరోపించారు. ఒక్క సంచి యూరియా కోసమేనా కాంగ్రెస్‌కు ఓటేసిందని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ పేరు తో సీబీఐకి అప్పగిస్తూ సీఎం రేవంత్‌రెడ్డి డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. ఘోష్ కమిషన్ కూడా ప్రాజెక్టుకు మరమ్మతు చేయాలనే చెప్పిందని, అవినీతిపై ప్రస్తావన లేదని పేర్కొన్నారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.