నేడు సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన | - | Sakshi
Sakshi News home page

నేడు సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

Sep 3 2025 5:16 AM | Updated on Sep 3 2025 5:16 AM

నేడు

నేడు సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

మహబూబ్‌నగర్‌ క్రైం/ అడ్డాకుల: మహబూబ్‌నగర్‌ జిల్లా మూసాపేట మండలం వేముల శివారులోని ఎస్‌జీడీ ఫార్మా కార్నింగ్‌ టెక్నాలజీస్‌ రెండో యూనిట్‌ను బుధవారం ఉదయం 11.30 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించి పరిశ్రమ వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ మేరకు మంగళవారం కంపెనీ ముందున్న స్థలంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ను కలెక్టర్‌ విజయేందిర, ఎస్పీ జానకి, ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి పరిశీలించారు. అలాగే పరిశ్రమ లోపల జరిగే కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించి కంపెనీ ప్రతినిధులతో మాట్లాడారు. సుమారు 1.45 గంటల పాటు సీఎం ఇక్కడ ఉండనున్నారు. మధ్యాహ్నం 12.45 గంటలకు హెలీకాప్టర్‌లో తిరిగి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాల కార్యక్రమానికి వెళ్లనున్నారు. సీఎంతోపాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు.

956 మందితో భద్రతా ఏర్పాట్లు

ఎస్‌జీడీ ఫార్మాలో రెండో యూనిట్‌ ప్రారంభానికి సీఎం రేవంత్‌రెడ్డి రానుండటంతో ఎస్పీ డి.జానకి బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షించారు. హెలిప్యాడ్‌, ట్రాఫిక్‌, వీఐపీ రాకపోకల మార్గాలను పరిశీలించి తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై అధికారులతో చర్చించారు. అనంతరం బందోబస్తు విధులు నిర్వహించనున్న పోలీస్‌ అధికారులు, సిబ్బందికి సూచనలు చేశారు. ఆయా విభాగాల నుంచి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ప్రధానంగా ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఉమ్మడి జిల్లాతో పాటు నల్లగొండ, వికారాబాద్‌, రంగారెడ్డి జిల్లాల నుంచి పోలీస్‌ బలగాలు విధులు నిర్వహించడానికి వేములకు చేరుకున్నారు. ఇద్దరు ఎస్పీలు, ఒక ఏఎస్పీ, ఐదుగురు డీఎస్పీలు, 27 మంది సీఐలు, 69 మంది ఎస్‌ఐలు, ఏఎస్‌ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు 173 మంది, కానిస్టేబుళ్లు 461 మంది, మహిళా సిబ్బంది 129, హోంగార్డులు 89 మందికి విధులు కేటాయించారు.

నిర్వాసితులకు

పరిహారం చెల్లించాలి

కోడేరు: మండలంలోని తీగలపల్లిలో జరుగుతున్న పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా భూములు కోల్పోయిన రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నర్సింహ అన్నారు. మంగళవారం రెండోరోజు కొనసాగిన దీక్ష శిబిరంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కొంతమంది రైతులకు మాత్రమే పరిహారం డబ్బులు వచ్చాయని మిగతా వారికి రాకపోవడంతో కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి పరిహారం చెల్లించాలని కోరారు.

డిగ్రీ ఆర్ట్స్‌ కళాశాలప్రిన్సిపాల్‌ గీతాంజలి

కందనూలు: జిల్లాకేంద్రంలోని శ్రీపురం రోడ్డు ప్రభుత్వ ఆర్ట్స్‌ డిగ్రీ కళాశాల నూతన ప్రిన్సి పాల్‌గా గీతాంజలి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌ ఇందిరా ప్రియదర్శిని కళాశాలలో వైస్‌ ప్రిన్సిపాల్‌గా పనిచేసి పదోన్నతిపై జిల్లాకేంద్రంలోని డిగ్రీ కళాశాలకు ప్రిన్సిపాల్‌గా వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కళాశాల అభివృద్ధితోపాటు విద్యార్థుల అభ్యున్నతి కోసం తనవంతు కృషిచేస్తానన్నారు. అధ్యాపకులు ప్రిన్సిపాల్‌కు స్వాగతం పలికి అభినందనలు తెలిపారు.

నేడు సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన 
1
1/1

నేడు సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement