
అథ్లెటిక్స్ పోటీల్లో ప్రతిభ
కందనూలు: మహబూబ్‌నగర్ పట్టణంలోని పాలమూరు విశ్వవిద్యాలయంలో రెండు రోజులుగా జరుగుతున్న 11వ తెలంగాణ రాష్ట్ర జూనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో కందనూలు విద్యార్థులు అండర్–20 విభాగంలో శ్రీను గోల్డ్ మెడల్, నవీన్‌కుమార్ బ్రౌంజ్ మెడల్, అండర్– 18 విభాగంలో ఉదయ్‌కిరణ్ గోల్డ్‌మెడల్, అండర్– 20 బాలికల విభాగంలో స్వప్న గోల్డ్ మెడల్ పతకాలు సాధించారని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి స్వాములు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌లో జిల్లా క్రీడాకారులు పతకాలు సాధించడంతో క్రీడాకారులు, తల్లిదండ్రులు తదితరులు హర్షం వ్యక్తం చేశారు.