
నేటి నుంచి పబ్బతి అంజన్న పవిత్రోత్సవాలు
అమ్రాబాద్: మద్దిమడుగు పబ్బతి ఆంజనేయస్వామి పవిత్రోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మూడు రోజులపాటు ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. 5న ఉదయం 10గంటల నుంచి మహాగణపతి పూజ, పుణ్యహవచనం, పంచగవ్యం, దీక్షారాధన, వాస్తు శాంతి, తీర్థప్రసాద వితరణ, సాయంత్రం 6గంటల నుంచి యాగశాల ప్రవేశం, అంకురార్పణ, యాగశాలలో కలశ స్థాపన, అగ్నిప్రతిష్ఠ తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 6న గవ్యాంతర పూజలు, వేధికార్చన, మండలార్చన, యాగశాలలో పట్టు పవిత్రాల అలంకరణ, మూలమంత్ర హోమాలు, నంపాత హోమం, లఘు పూర్ణాహుతి, 7న గవ్యాంతర పూజలు, యాగశాలలో కలశ దేవతలకు ఆరాధన, మూలమంత్ర హోమాలు, మహా పూర్ణాహుతి, కలశ ఉద్వాసన, కుంభములతో ఆలయ ప్రవేశం, స్వామివారికి కుంభ జలాలతో అభిషేకం, విశేష ఆరాధన, పట్టు పవిత్ర సమర్పణ కార్యక్రమాలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.