
ఇబ్బంది పడుతున్నాం..
మా కాలనీలోని డ్రెయినేజీ పూర్తిగా పాడైంది. కనీసం డ్రెయినేజీలోని చెత్తాచెదారం, పూడిక తొలగించడం లేదు. నిత్యం దుర్గంధంతో ఇబ్బందులు పడుతున్నాం. మురుగునీరు బయటకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలి.
– కొట్ర మహేశ్, శ్రీపురం చౌరస్తా, నాగర్‌కర్నూల్
పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి..
వానాకాలం నేపథ్యంలో పారిశుద్ధ్య సమస్యలపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తాం. డ్రెయినేజీలు లేని ప్రాంతాల్లో నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం. అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నుంచి మురుగు బయటికి రాకుండా చూస్తాం. ప్రస్తుతానికి జెట్టింగ్ మిషన్ల ద్వారా మురుగునీటి తొలగింపు చేపడతాం. – నాగిరెడ్డి,
మున్సిపల్ కమిషనర్, నాగర్‌కర్నూల్
●