
పారిశుద్ధ్యం.. అస్తవ్యస్తం
సాక్షి, నాగర్‌కర్నూల్: అసలే వానాకాలం.. మున్సిపాలిటీల్లో మురుగుతో పాటు వర్షపునీరు రోడ్లపైనే పారుతోంది. డ్రెయినేజీల్లో చెత్తాచెదారం నిండిపోవడంతో నీరు పారేందుకు వీలులేక రోడ్లపైకి చేరుతోంది. వానాకాలానికి ముందే అప్రమత్తంగా ఉండి ముందస్తు చర్యలు చేపట్టాల్సిన అధికార యంత్రాంగం.. నిర్లక్ష్యం వహిస్తోంది. జిల్లాకేంద్రంతో పాటు ఇతర మున్సిపాలిటీల్లో ఎక్కడా సంబంధిత యంత్రాంగంలో సన్నద్ధత కనిపించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వానాకాలంలో పారిశుద్ధ్య నిర్వహణపై దృష్టిపెట్టాలని ప్రజలు కోరుతున్నారు.
శివారు ప్రాంతాల్లో అధ్వానం..
జిల్లా కేంద్రంతో పాటు కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్ మున్సిపాలిటీల్లోని శివారు ప్రాంతాల్లో డ్రెయినేజీల నిర్మాణం చేపట్టకపోవడంతో మురుగు రోడ్లపైనే పారుతోంది. ఇళ్లలోకి వర్షపునీరు, మురుగు చేరుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లోనూ డ్రెయినేజీ నిర్వహణకు చర్యలు చేపట్టడం లేదు. జిల్లా కేంద్రంలోని రాంనగర్ కాలనీలో పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది.
నాలాలు అన్యాక్రాంతం..
వానాకాలంలో వరదనీటిని పట్టణం నుంచి బయటకు పంపేందుకు కీలకమైన నాలాలు చాలాచోట్ల అన్యాక్రాంతానికి గురవుతున్నాయి. నాలాలను కబ్జాచేసి నిర్మాణాలు చేపడుతున్నా పర్యవేక్షణ కరువైంది. ఏళ్ల క్రితం నిర్మించిన నాలాలకు మరమ్మతులు, నిర్వహణ లేక పూడిక, చెత్తాచెదారంతో కనిపిస్తున్నాయి. మురుగు, వరదనీరు పారేందుకు వీలులేక రోడ్లపైనే పారుతూ.. ఇళ్లలోకి చేరుతున్న పరిస్థితులు నెలకొన్నాయి.
మున్సిపాలిటీల్లోకంపు కొడుతున్న కాలనీలు
రోడ్లపైనే పారుతున్న మురుగు
శివారు ప్రాంతాల్లో డ్రైయినేజీలు కరువు
ఇళ్లలోకి చేరుతున్న మురుగునీరు
వానాకాలం నేపథ్యంలో ఎక్కడా కనిపించని పారిశుద్ధ్య చర్యలు

పారిశుద్ధ్యం.. అస్తవ్యస్తం

పారిశుద్ధ్యం.. అస్తవ్యస్తం

పారిశుద్ధ్యం.. అస్తవ్యస్తం

పారిశుద్ధ్యం.. అస్తవ్యస్తం