
ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం
పెంట్లవెల్లి: ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం పెంట్లవెల్లిలో రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్‌తో కలిసి ఆయన మైనార్టీ మహిళలకు 109 కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేదల అభ్యున్నతే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభు త్వం పనిచేస్తోందన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలుచేస్తూ వస్తున్నట్లు చెప్పారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు మంజూరు చేస్తామ న్నారు. పెంట్లవెల్లి మండలాన్ని అన్నివిధాలా అభి వృద్ధి చేయడంతో పాటు ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామన్నారు. మైనార్టీల అభ్యున్నతి కోసం రూ. 20లక్షలు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. అనంతరం పెంట్లవెల్లి కస్తూర్బాగాంధీ బాలి కల విద్యాలయంలో రత్నగిరి ఫౌండేషన్, రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో రూ. 17లక్షల విలువైన కిడ్ బెడ్స్ ను మంత్రి జూపల్లి అందజేశారు. కేజీబీవీలో కల్పిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకొని చదువులో ఉన్నతంగా రాణించాలని విద్యార్థినులకు సూ చించారు. కార్యక్రమంలో నాయకులు రామన్‌గౌడ్, నర్సింహ యాదవ్, నల్లపోతుల గోపాల్, ఎర్ర శ్రీనివాసులు, ఎండీ కబీర్, మాజీ సర్పంచ్ సువర్ణమ్మ, గోపినాయక్, తిరుపాటి నాగరాజు, ధర్మతేజ, ఆంజనేయులు, భీంరెడ్డి, కుమార్ పాల్గొన్నారు.
పేదల అభ్యున్నతికి నిరంతర కృషి
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు అందిస్తాం
రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు