
యోగాతో ఒత్తిడిని అధిగమిద్దాం
నాగర్‌కర్నూల్/నాగర్‌కర్నూల్ క్రైం: ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడిని అధిగమించేందుకు యోగా దోహదపడుతుందని జిల్లా జడ్జి రమాకాంత్ అన్నారు. శనివారం జిల్లా కోర్టు ఆవరణలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో జిల్లా జడ్జి పాల్గొని.. న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బందితో కలిసి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. యోగాతో ఏకాగ్రత పెరగడంతో పాటు అధిక బరువును నియంత్రించవచ్చన్నారు. అదే విధంగా రక్తప్రసరణ మెరుగుపడి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుందన్నారు. ప్రతి ఒక్కరూ యోగా ఆచరించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నసీం సుల్తానా, సీనియర్ సివిల్‌జడ్జి వెంకట్‌రాం, సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్‌జడ్జి శ్రీనిధి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రవికాంతరావు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా జడ్జి రమాకాంత్