
ఔత్సాహికులకు నిరుత్సాహం
● ఉమ్మడి జిల్లాలో ఏర్పాటుకు
నోచుకోని స్పోర్ట్స్ స్కూల్
మహబూబ్‌నగర్ క్రీడలు: స్పోర్ట్స్ స్కూళ్లు ఔత్సాహిక క్రీడాకారులకు వరంగా మారుతున్నాయి. రాష్ట్రంలో హైదరాబాద్ (హకీంపేట), కరీంనగర్, ఆదిలాబాద్‌లో క్రీడా పాఠశాలలు ఉండగా.. 20 మంది బాలురు, 20 మంది బా లికల చొప్పున ప్రవేశాలు కల్పిస్తున్నారు. ప్రస్తు తం స్పోర్ట్స్ స్కూళ్లలో చిన్నారులను చేర్పించాలనే సంకల్పం చాలామంది తల్లిదండ్రుల్లో కనిపిస్తోంది. అయితే రాష్ట్రంలో కేవలం మూడు స్పోర్ట్స్ స్కూళ్లే ఉండటంతో చాలా మంది వి ద్యార్థులకు అవకాశాలు దక్కడం లేదు.
వనపర్తిలో స్థల సేకరణ
ఉమ్మడి జిల్లాలోని మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోనైనా రెండు స్పోర్ట్స్ స్కూళ్లు ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. ఇప్పటికే వనపర్తి జిల్లాకేంద్రంలోని మర్రికుంట సమీపంలో స్పోర్ట్స్ స్కూల్ కోసం స్థల సేకరణ చేపట్టారు. వెంటనే వనపర్తిలో స్పోర్ట్స్ స్కూల్‌ను ప్రారంభించాలని ఆ ప్రాంత క్రీడాభిమానులు ఆశాభావం వ్యక్తం చేశారు.
మెరుగైన క్రీడా వసతులు
గతేడాది రాష్ట్రంలోని మూడు స్పోర్ట్ స్కూళ్లలో ఉమ్మడి జిల్లా నుంచి 29 మంది విద్యార్థులు 4వ తరగతిలో ప్రవేశాలు పొందారు. వనపర్తితోపాటు ఉమ్మడి జిల్లాలో మరోచోట స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటైతే మరింత ఎక్కువ మంది చిన్నారులు స్పోర్ట్స్ స్కూళ్లకు ఎంపికవుతారు. స్పోర్ట్స్ స్కూళ్లలో చిన్నారులకు ఎన్నో మెరుగైన క్రీడావసతులు అందుబాటులోకి వస్తాయి. తొలుత చిన్నారులకు ఫ్లెక్సిబిలిటీ తదితర అంశాల్లో పరీక్షించి వారు ఏ క్రీడల్లో రాణించే అవకాశం ఉందో అందులో ప్రత్యేక శిక్షణ ఇస్తారు. అదేవిధంగా క్రీడా శిక్షణతోపాటు చదువుకూ ప్రాధాన్యం ఉంటుంది.
నైపుణ్యాలు వెలికి..
స్పోర్ట్స్ స్కూళ్లతో చిన్నారుల్లో దాగివున్న క్రీడానైపుణ్యాలను వెలికితీయవచ్చు. ప్రస్తుతం ఆయా క్రీడల్లో అంతర్జాతీయ, జాతీయస్థాయిల్లో రాణిస్తున్న క్రీడాకారుల్లో చాలామంది స్పోర్ట్స్ స్కూల్ నుంచి వచ్చిన వారే.
– శ్రీనివాస్, డీవైఎస్‌ఓ, మహబూబ్‌నగర్
●