
నీరు పారే దారేది?
మున్సిపాలిటీల్లో నాలాలపైపర్యవేక్షణ కరువు
● చాలా చోట్ల కాల్వలుఅన్యాక్రాంతం
● సాఫీగా పారని వరద,మురుగునీరు
● వానాకాలంలో కాలనీలను ముంచెత్తుతున్న వరద
● వాననీటి నిర్వహణకు కరువైన ప్రణాళిక
సాక్షి, నాగర్‌కర్నూల్: చినుకు పడిందంటే చాలు.. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజల్లో వణుకు పుడుతోంది. వరద, బురదనీరు ఎప్పుడు తమ ఇళ్లలోకి వచ్చి చేరుతుందోనని ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఏళ్లుగా ఉన్న వరదనీటి కాల్వలు, నాలాలు క్రమంగా అన్యాక్రాంతం అవుతున్నాయి. వివిధ నిర్మాణాలతో కుంచించుకుపోతున్నాయి. ఫలితంగా వర్షం పడినప్పుడు నీరంతా బయటకు వెళ్లే దారి లేక సమీపంలోని కాలనీలను ముంచెత్తుతోంది. వానాకాలం నేపథ్యంలో ముందస్తుగానే మేల్కొని వాననీటి నిర్వహణపై ప్రత్యేక కార్యాచరణ చేపట్టాల్సిన అధికార యంత్రాంగం.. ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. దీంతో లోతట్టు ప్రాంతాలు, నాలాల సమీప ప్రాంతాల్లోని ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది.

నీరు పారే దారేది?

నీరు పారే దారేది?