మోటార్‌ వాహన చట్టం నిబంధనలు పాటించాలి | - | Sakshi
Sakshi News home page

మోటార్‌ వాహన చట్టం నిబంధనలు పాటించాలి

May 31 2025 12:18 AM | Updated on May 31 2025 12:18 AM

మోటార్‌ వాహన చట్టం నిబంధనలు పాటించాలి

మోటార్‌ వాహన చట్టం నిబంధనలు పాటించాలి

నాగర్‌కర్నూల్‌ క్రైం: ఆర్టీసీ డ్రైవర్లు మోటారు వాహన చట్టాల నిబంధనలు పాటిస్తూ ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలని జిల్లా రవాణా శాఖాధికారి చిన్న బాలు అన్నారు. శుక్రవారం ఆర్టీసీ డిపోలో ఉత్తమ ప్రతిభకనబరిచిన డ్రైవర్లు, కండక్టర్లకు అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి డ్రైవర్‌ నియమ, నిబంధనలు పాటిస్తూ డ్రైవింగ్‌ చేయాలని, రోడ్డుపైన బస్సు ఎడమవైపు మాత్రమే ఆపాలన్నారు. మద్యం తాగి ఆర్టీసీ బస్సు నడపకూడదని, డ్రైవింగ్‌ చేసేటప్పుడు ఫోన్‌ మాట్లాడవద్దని చెప్పారు. రోడ్డుపైన వస్తున్న ప్రయాణికులను గమనించి బస్సు డ్రైవింగ్‌ చేయాలని సూచించారు. కార్యక్రమంలో డిపో అసిస్టెంట్‌ మేనేజర్‌ బాలసరస్వతి, మెకానికల్‌ ఫోర్‌ మెన్‌ భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement