
బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చేస్తాం
కందనూలు: జిల్లాలో బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చేస్తామని పార్టీ జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రావు అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు సమావేశంలో జిల్లా సంస్థాగత ఎన్నికల సహ ఇన్‌చార్జ్ మొగిలి దుర్గాప్రసాద్‌తో కలిసి ఆయన మాట్లాడారు. జిల్లాలో పార్టీని పటిష్టపరచడానికి బూత్ స్థాయి నుంచి బలోపేతం చేస్తున్నామని, ఇందులో భాగంగానే నూతన మండల కమిటీలు ఏర్పాటు చేశామని, గతంలో చాలా మండలాల్లో కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందని, తాజాగా పది మండలాలకు అధ్యక్షులను నియమించామని వివరించారు. నాగర్‌కర్నూల్ మున్సిపల్ అధ్యక్షుడిగా ప్రమోద్‌కుమార్, తెలకపల్లి మండల అధ్యక్షుడిగా చిన్నారెడ్డి, తిమ్మాజిపేట మండలాధ్యక్షుడిగా యశ్వంత్, నాగర్‌కర్నూల్ రూరల్ అధ్యక్షుడిగా లోమేశ్వర్‌రెడ్డి, అచ్చంపేట రూరల్ అధ్యక్షురాలిగా జ్యోతి, లింగాల మండల అధ్యక్షుడిగా నవీన్, చారకొండ అధ్యక్షుడిగా కృష్ణ, బల్మూరు మండల అధ్యక్షుడిగా బాలస్వామి, పదర మండల అధ్యక్షుడిగా రవి, అమ్రాబాద్ మండల అధ్యక్షుడిగా శ్రీనివాసులును నియమించినట్లు చెప్పారు. ఈ నెల 15లోగా గ్రామాల్లో బూత్ కమిటీలను ఏర్పాటు చేసిన ఉద్యమ కార్యాచరణ తీవ్రతరం చేస్తామన్నారు.