ములుగు: వానాకాలం సీజన్ ప్రారంభానికి ముందే ఎరువుల ధరలు పెరగడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కూలీల కొరతతో పాటు యంత్రాల ఖర్చులు అధికంగా ఉన్న నేపథ్యంలో ఎరువుల ధరలు పెరగడం పంటల సాగుపై ప్రభావం చూపుతుంది. ఒకవైపు నకిలీ విత్తనాలు, మరోవైపు ఎరువుల కొరత, పండించిన పంటలకు మద్దతు ధర లేక రైతులు కలవరపడుతుంటే ప్రభుత్వం ఎరువుల ధరలను పెంచడంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎకరానికి రూ.4 వేలకు పైగా పెట్టుబడి ఖర్చులు పెరుగుతాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే రైతు భరోసా డబ్బులు సకాలంలో రాకపోవడంతో పాటు యాసంగిలో రెండు ఎకరాల వరకే పెట్టుబడి సాయం అందడంతో ఆందోళన చెందుతున్నారు.
రూ.400ల వరకు పెరిగిన ధరలు
కాంప్లెక్స్ ఎరువులు ఒక బస్తాకు రూ.100 నుంచి రూ.400ల వరకు పెరిగాయి. రైతులు అధిక దిగుబడులు సాధించేందుకు ఎరువులను అధికంగా వాడుతున్నారు. ఎరువుల ధరల పెరుగుదల రైతులకు ఆర్థికభారం పెంచుతోంది. కాంప్లెక్స్ ఎరువుల ధరలు భారీగా పెరగడంతో సాగు ఖర్చులు మరింత పెరిగి అన్నదాతలపై ఆర్థికభారం పడనుంది. రైతులకు ప్రభుత్వం అందిస్తున్న పెట్టుబడి సాయం పంట పొలాలను సిద్ధం చేసి విత్తనాల కొనుగోలుకు మాత్రమే సరిపోతుంది. ఎరువుల కొనుగోలుకు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తుంది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలకు మద్దతు ధర లేకపోవడంతో పాటు క్వింటా ధాన్యానికి మిల్లర్లు సుమారు 10 కిలోల వరకు కోత పెడుతుండడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పెట్టుబడి సాయం బదులు వందశాతం సబ్సిడీపై ఎరువులను ఉచితంగా అందించాలని రైతులు కోరుతున్నారు.
అవసరమయ్యే ఎరువులు (మెట్రిక్ టన్నుల్లో)
యూరియా 17,504
డీఏపీ 10,000
ఎంఓపీ 8,000
పెరిగిన ఎరువుల ధరలు ఇలా (రూ.లల్లో)
కొత్త ధర
పాత ధర
2,250
1.950
2,350
1,975
2,400
1,350
2,175
2,025
1,600
1,800
1,850
1,500
615
775
సూపర్
పొటాష్
డీఏపీ
20:20:0:13
12:32:16
10:26:26
14:35:14
15:15:15
28:28:0
వానాకాలం ముందే పెరిగిన ధరలు
అన్నదాతలకు
సాగు ఖర్చులు రెట్టింపు
జిల్లాలో 1,63,229 ఎకరాల్లో
సాగు అంచనా
ఉచితంగా అందించాలి
రైతే దేశానికి వెన్నెముక, రైతు లేకపోతే రాజ్యం లేదు. దేశానికి అన్నం పెట్టే రైతన్నలు బాగుపడాలంటే ప్రభుత్వం ఎరువులను ఉచితంగా అందించాలి. వేలాది రూపాయల పెట్టుబడి పెట్టి పంటలను సాగు చేస్తున్నా.. చివరికి అవి చేతికొచ్చే పరిస్థితి లేదు. అతివృష్టి, అనావృష్టితో నిత్యం సతమతమవుతున్నా.. మళ్లీ వ్యవసాయానికే మొగ్గుచూపి పంటలను పండిస్తున్నారు. ఇప్పటికై న రైతులకు ఎరువులు ఉచితంగా అందించి పంటలకు మద్దతు ధర అందించాలి. –అల్లాడి రాజేశ్వర్‌రావు, రైతు, ములుగు


