● డీఆర్‌డీఓ చంద్రశేఖర్
వెంకటాపురం(కె): గ్రామ సమాఖ్య ఫెడరేషన్ భవన నిర్మాణాలు వేగవంతం చేయాలని డీఆర్‌డీఓ చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం మండలపరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్‌లు గ్రామ సమాఖ్య వీఓలు, స్వయం సహాయక సంఘాల ఫెడరేషన్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మండలంలో 31 గ్రామసమాఖ్య భవనాలకు ఒక్కో భవన నిర్మాణానికి రూ.10లక్షల చొప్పున ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. జిల్లాలోనే అత్యధికంగా వెంకటాపురం మండలానికి భవనాలు మంజూరయ్యాయని, ఈనెల 25వ తేదీ లోపు బేస్‌మెంట్ లెవల్ పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ బొగ్గం నారాయణ, ఏపీఎంలు రాజు, అప్పారావు, పీఆర్‌ఏఈ చరణ్, ఏపీఓ భవాని, సీసీలు శంకరమ్మ, నర్సయ్య, సమ్మయ్య, వెంకటలక్ష్మి, మండల సమాఖ్య అధ్యక్షురాలు పూనెం ఉషారాణి తదితరులు ఉన్నారు.
వాజేడులో..
వాజేడు: మహిళా సంఘాలు ఆర్థికాభివృద్ధి చెందాలని డీఆర్‌డీఓ చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో సర్పంచ్‌లు, కార్యదర్శులు, మహిళా సంఘాల సభ్యులతో సమావేశం నిర్వహించారు. వీఓ భవన నిర్మాణాన్ని త్వరగా పూర్తిచేయాలని సూచించారు. ఎంపీడీఓ కృపాకర్, ఎంపీఓ చందులాల్, ఏపీఎం సతీష్ తదితరులు ఉన్నారు.


