నకిలీవి విక్రయిస్తే కఠిన చర్యలు | - | Sakshi
Sakshi News home page

నకిలీవి విక్రయిస్తే కఠిన చర్యలు

Jun 6 2026 12:53 AM | Updated on Jun 6 2026 12:53 AM

ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌

భూపాలపల్లి: నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌ శుక్రవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. రైతులను మోసంచేసే వారిపై క్రిమినల్‌ కేసులతో పాటు పీడీ యాక్ట్‌లు నమోదు చేస్తామన్నారు. పోలీసుశాఖ ఆధ్వర్యంలో సీసీఎస్‌ టీం శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఫర్టిలైజర్‌ షాపుల్లో తనిఖీ చేసిందన్నారు. నకిలీ విత్తనాలు, ఎరువుల విక్రయాలను అరికట్టేందుకు జిల్లాలోని ప్రతీ మండలంలో రెవెన్యూ, పోలీస్‌, వ్యవసాయ శాఖల సమన్వయంతో ప్రత్యేక టాస్క్‌ ఫోర్స్‌ బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

శాఖల సమన్వయం కీలకం..

మహిళలు, చిన్నారులపై జరిగే హింస, వేధింపుల కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం, రక్షణ, పునరావాస సేవలు అందించేందుకు సంబంధిత అన్ని శాఖల మధ్య సమన్వయం అత్యంత అవసరమని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌ అన్నారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో భరోసా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మహిళలు, చిన్నారుల సంక్షేమానికి సంబంధించిన వివిధ శాఖల అధికారులు, ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో అడిషనల్‌ ఎస్పీ నరేష్‌కుమార్‌, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement