ములుగు: ప్రపంచ పర్యావరణ పరిరక్షణను దృష్టిలో పెట్టుకొని ప్లాస్టిక్ కవర్స్, గ్లాసులు, ప్లేట్స్ నిషేధించాలని కోరుతూ శుక్రవారం పర్యావరణ విభాగం ములుగు ప్రముఖులు కొండా గిరివర్థఽన్, గండ్రకోట కుమార్ ములుగు మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందించారు. ములుగులో ప్లాస్టిక్ పదార్థాలు చాలామంది కాల్చి వేస్తున్నారని తెలిపారు. ప్లాస్టిక్ నిషేధించి స్టీల్ పాత్రలు వాడే వి ధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు కొత్తపల్లి పోషన్న, భాష బోయిన మహేందర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఎన్‌ఎంఎంఎస్‌లో ప్రతిభ
ములుగు రూరల్: నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్ షిప్ (ఎన్‌ఎంఎంస్) పరీక్షలో బండారుపల్లి మోడల్ స్కూల్ విద్యార్థులు తమ ప్రతిభను చాటా రు. శుక్రవారం వెలువడిన ఫలితాల్లో బండారుపల్లి మోడల్ స్కూల్‌కు చెందిన ఎనిమిది మంది విద్యార్థులు స్కాలర్ షిప్‌కు ఎంపికై నట్లు ప్రిన్స్‌పాల్ దేవకి తెలిపారు. విద్యార్థులను అభినందించారు.


