భద్రతకు అత్యంత ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

భద్రతకు అత్యంత ప్రాధాన్యం

Jun 5 2026 4:29 AM | Updated on Jun 5 2026 4:29 AM

భూపాలపల్లి అర్బన్‌: ప్రతీ ఉద్యోగి భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఏరియా జనరల్‌ మేనేజర్‌ ఏనుగు రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. ఏరియాలోని కేటీకే–1 గనిలో గురువారం ప్రత్యేక భద్రతా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఉద్యోగులకు భద్రతా నియమాలు, పనిస్థలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రమాదాల నివారణ చర్యలపై ఈ సందర్భంగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జీఎం రాజేశ్వర్‌ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతీ ఉద్యోగి భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. సింగరేణి నిర్దేశించుకున్న జీరో హార్మ్‌ లక్ష్య సాధనకు ప్రతి ఒక్కరూ కట్టుబడి పనిచేయాలన్నారు. ప్రమాదాలను పూర్తిగా నివారించేందుకు భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అప్రమత్తతతో విధులు నిర్వహించడం ద్వారా ప్రమాదాల అవకాశాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్‌ఓ మాటూరి రవీందర్‌, ఏరియా ఇంజనీర్‌ రాజారావు, కేటీకే–1వ గని మేనేజర్‌ ప్రవీణ్‌ విక్రమ్‌, కార్మిక సంఘాల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

ఏరియా జీఎం రాజేశ్వర్‌ రెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement