జిల్లాలో వ్యాధిగ్రస్తుల వివరాలు
ములుగు రూరల్: క్షయ వ్యాధి నిర్మూలనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. వ్యాధిగ్రస్తులు సరైన చికిత్స తీసుకోకపోవడం వల్ల తీవ్రత పెరిగిపోవడంతో పాటు ఇతరులకు సంక్రమిస్తుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువ మంది ప్రజలు క్షయ వ్యాధి బారిన పడుతున్నారు. వ్యాధిగ్రస్తులను గుర్తించి సకాలంలో చికిత్స అందించేందుకు జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నారు. బాధితులకు అవసరమైన మందులతో పాటు పోషకాహార లోపం లేకుండా ఉండేందుకు ప్రభుత్వం నిక్షయమిత్ర ద్వారా కిట్లను అందిస్తోంది.
క్షయవ్యాధి నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది గ్రామాలలో విస్తృత ప్రచారం చేపడుతున్నారు. దీంతో పాటు గ్రామాలలో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించి స్క్రీనింగ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలలో 14 ఏళ్లు నిండిన వారి నుంచి 60 ఏళ్ల వయస్సు కలిగిన వారికి తెమడ పరీక్షలతో పాటు స్క్రీనింగ్ చేసి వ్యాధి నిర్ధారణ చేపడుతున్నారు.
జిల్లాలోని పది మండలాల పరిధిలో క్షయవ్యాధిగ్రస్తులు 248 మంది ఉన్నట్లు జిల్లా వైద్యారోగ్యశాఖ నివేదికలు తెలుపుతున్నాయి. క్షయవ్యాధి నిర్మూలన జిల్లాగా తీర్చిదిద్దేందుకు వైద్యశాఖ ఆధ్వర్యంలో గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. జిల్లాలో క్షయవ్యాధి తీవ్రత ఆధారంగా 20 గ్రామాలను ఎంపిక చేసి 100 శాతం ప్రజలకు క్షయవ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో తొలుత మూడు గ్రామాలను ఎంపిక చేసి క్షయవ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. తెమడ పరీక్షల్లో నిర్ధారణ కాని వారికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
క్షయవ్యాధి నిర్మూలనకు
ప్రభుత్వ చర్యలు
అధునాతన పరికరాలతో స్క్రీనింగ్
వ్యాధిగ్రస్తులకు పోషణ కిట్ల అందజేత
మండలం వ్యాధిగ్రస్తులు
ములుగు 46
వెంకటాపురం(ఎం) 25
గోవిందరావుపేట 27
ఎస్‌ఎస్ తాడ్వాయి 25
ఏటూరునాగారం 24
కన్నాయిగూడెం 13
మంగపేట 30
వెంకటాపురం(కె) 36
వాజేడు 22


