వైభవంగా ముయ్యలమ్మ జాతర | - | Sakshi
Sakshi News home page

వైభవంగా ముయ్యలమ్మ జాతర

Jun 5 2026 4:29 AM | Updated on Jun 5 2026 4:29 AM

భారీగా తరలివచ్చిన భక్తజనం

వాజేడు: మండల పరిధిలోని చీకుపల్లి గ్రామంలో గురువారం ముయ్యలమ్మ జాతరను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గొంది ఇంటిపేరు ఉన్న వారు జాతరను నిర్వహించగా భక్తులు భారీగా తరలివచ్చారు. పూజారుల సమక్షంలో గ్రామస్తులు మేళతాళాల నడుమ గుట్ట నుంచి నేరుగా ముయ్యలమ్మ గద్దెకు వనం తీసుకుకొచ్చారు. సాంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహించారు. సాయంత్రం 4 గంటలకు గుట్ట నుంచి ముయ్యలమ్మ దేవతను తీసుకొచ్చారు. అనంతరం పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించగా భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. తమ కోర్కెలు తీర్చాలని దేవతను వేడుకున్నారు. కొత్తగూడెం, ములుగు, ఛత్తీస్‌గఢ్‌ నుంచి గొంది వంశస్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన గిరిజన సాంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement