డయాగ్నొస్టిక్‌ సెంటర్లకు అనుమతులు తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

డయాగ్నొస్టిక్‌ సెంటర్లకు అనుమతులు తప్పనిసరి

Jun 5 2026 4:29 AM | Updated on Jun 5 2026 4:29 AM

మంగపేట : డయాగ్నొస్ట్టిక్‌ సెంటర్లకు ప్రభుత్వ అనుమతులు తప్పనిసరిగా ఉండాలని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ క్రాంతికుమార్‌ తెలిపారు. మండల కేంద్రంలోని పలు ప్రైవేట్‌ రక్తపరీక్ష కేంద్రాలను ఆయన గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డయాగ్నొస్టిక్స్‌ సెంటర్ల సర్టిఫికెట్లతో పాటు ఓపీ రిజిస్టర్లు, ల్యాబ్‌ సౌకర్యాలను పరిశీలించి నిర్వహణలో లోపాలను గుర్తించి వైద్య ఆరోగ్యశాఖ నిబంధనలు పాటించాలని సూచించారు. అదే విధంగా అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఈఎస్‌ఆర్‌ డయాగ్నొస్టిక్‌ సెంటర్‌ను తనిఖీ చేశారు. ప్రభుత్వ అనుమతి లేకుండా సెంటర్‌ను నిర్వహించడం, అర్హత లేకుండా పరీక్షలు నిర్వహించడం చట్టరీత్యా నేరమన్నారు. వెంటనే పరీక్షలు నిలిపివేసి వారం రోజుల్లో నిర్వహణకు సంబంధించి అనుమతులు చూపించాలని నోటీసులను జారీ చేశారు. ఆయన వెంట మంగపేట పీహెచ్‌సీ వైద్యాధికారి అఖిల ఉన్నారు.

డిప్యూటీ డీఎంహెచ్‌ఓ క్రాంతికుమార్‌

Advertisement
 
Advertisement
Advertisement