ఏటూరునాగారం: సమస్యల పరిష్కారమే లక్ష్యంగా విద్యుత్ వినియోగదారుల ఫోరం పనిచేస్తుందని ఫోరం చైర్మన్ వేణుగోపాలచారి తెలిపారు. మండల కేంద్రంలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌లో బుధవారం నిర్వహించిన వినియోగదారుల ఫోరం వేదికలో వినియోగదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యుత్ అధికారులు వినియోగదారుల సమస్యలను పట్టించుకోకపోతే ఫోరానికి ఫిర్యాదు చేయాలన్నారు. గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు తీసివేయడం, కొత్తవి మార్చడం, మీటర్లను అమర్చడం, బిల్ అధికంగా రావడం వంటి సమస్యలను ఫోరం పరిష్కరిస్తుందని వెల్లడించారు. ఏటూరునాగారం మండల కేంద్రంలో ప్రధాన రోడ్డు వెంట ఉన్న స్తంభాలు కొత్తవి వేయాలని, తీగలను అమర్చాలని పలువురు ఫిర్యాదు చేశారని తెలిపారు. 1912 నంబర్‌కు కాల్ చేసి సమాచారం అందజేసి సమస్యలను పరిష్కరించుకోవచ్చు వివరించారు. అనంతరం వినియోగదారుల ఫోరం చైర్మన్ వేణుగోపాల చారి ఈ నెలలో ఉద్యోగ విరమణ పొందుతున్న సందర్భంగా అధికారులు, సిబ్బంది ఘనంగా చైర్మన్‌ను సన్మానించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ఫైనాన్స్ సభ్యుడు దేవేందర్, ఇండిపెండెంట్ సభ్యుడు రామారావు, డీఈ పురుషోత్తం, ఏడీఈ ఉమారావు, సబ్ ఇంజనీర్లు పాల్గొన్నారు.
ఫోరం చైర్మన్ వేణుగోపాలచారి


