పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత | - | Sakshi
Sakshi News home page

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

Jun 3 2026 12:57 AM | Updated on Jun 3 2026 12:57 AM

ఎఫ్‌ఆర్‌ఓ అబ్దుల్‌ రహమాన్‌

ఏటూరునాగారం: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని ఏటూరునాగారం దక్షిణం రేంజ్‌ అధికారి అబ్దుల్‌ రహమాన్‌ అన్నారు. ప్రజాపాలన ప్రగతిలో ప్రణాళికలో భాగంగా మంగళవారం మండల కేంద్రంలోని 163 జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న చెత్తాచెదారం, ప్లాస్టిక్‌ వంటి వ్యర్థాలను సిబ్బందితో కలిసి తొలగించారు. ఈ సందర్భంగా ఎఫ్‌ఆర్‌ఓ మాట్లాడుతూ చిన్నబోయినపల్లి పల్లె ప్రకృతి వనం నుంచి అటవీశాఖ చెక్‌ పోస్టు వరకు చెత్తాచెదారం ఏరివేత కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ప్రతీ ఇంటికి ఐదు మొక్కలు పెంచాలని కోరారు. విద్యార్థులు పాఠశాలల్లో క్రీడా మైదానాల వెంట మొక్కలను పెంచాలని సూచించారు.

మీడియా క్రికెట్‌ పోటీలు ప్రారంభం

ములుగు రూరల్‌: మీడియా క్రికెట్‌ పోటీలు అట్టహాసంగా మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ మేరకు జాకారం పోలీస్‌ హెడ్‌ క్వాటర్స్‌లో ఎస్పీ సుధీర్‌ రాంనాథ్‌ కేకన్‌ , డీఎఫ్‌ఓ వికాస్‌ మీనా క్రీడాపోటీలను ప్రారంభించారు. ములుగు ప్రింట్‌ మీడియా, వాజేడు టీంలు హోరాహోరీగా తలపడ్డాయి. ములుగు మీడియా టీంలో ఎస్పీ సుధీర్‌ రాంనాథ్‌ కేకన్‌ ఆడగా వాజేడు జట్టులో కలెక్టర్‌ బోర్ఖడే హేమంత్‌ సహదేవరావు ఆడారు. ఈ పోటీలో వాజేడు జట్టు విజయం సాధించింది. అన్ని మండలాల జట్లు పోటీలలో పాల్గొని గెలిచిన జట్టుతో పోలీస్‌ టీం తలపడనుంది.

Advertisement
 
Advertisement
Advertisement