పర్యాటక వారోత్సవాల్లో భాగంగా జిల్లా పర్యాటక ప్రాంతాలను సృజనాత్మకంగా రీల్స్ చేసి పంపిన ఇన్‌ఫ్లుఝెన్సర్స్ రీల్స్ కాంపిటీషన్ విజేతలకు మంత్రి సీతక్క నగదు పురస్కారాన్ని అందించారు. మంగపేట మండలానికి చెందిన శ్రావణ్‌కుమార్‌కు ప్రథమ బహుమతి రూ.21 వేలు, ఏటూరునాగారం మండలానికి చెందిన రాకేష్‌కు రూ.15వేలు, మామునూరుకు చెందిన కావ్యకు రూ.10 వేల నగదు ప్రోత్సాహకాన్ని మంత్రి సీతక్క అందజేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, అదనపు కలెక్టర్లు మహేందర్ జీ, సంపత్ రావు, మున్సిపాలిటీ చైర్‌పర్సన్ చింతనిప్పుల చంద్రకళ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగా కల్యాణి, ఇన్‌చార్జ్ ఆర్డీఓ ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.


