మేడారం జాతరలో గణనీయమైన మార్పులు వచ్చాయి. మాస్టర్ ప్లాన్‌లో భాగంగా మేడారం మహాజాతరకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 150 కోట్లతో పనులు చేపట్టారు. మరో రూ. 100 కోట్లతో రోడ్ల విస్తరణ, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాట్లతో పాటు మేడారం ప్రధాన కూడళ్లు, జంక్షన్లలో పెను మార్పులు తీసుకొచ్చారు. అలాగే రామప్ప, లక్నవరం, మేడారం, బొగత జలపాతం, మల్లూరు లక్ష్మీనర్సింహస్వామి కొలువైన హేమాచలక్షేత్రం వంటి ప్రదేశాలు పర్యాటక ప్రాంతాలుగా విరాజిల్లుతున్నాయి. జిల్లాలోని జంగాలపల్లి, తాడ్వాయి ఎన్‌హెచ్‌పై ప్రధాన కూడళ్లలో థీమ్స్ నిర్మాణాలు పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా మారాయి.


