రాష్ట్ర అవతరణ వేడుకలకు ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర అవతరణ వేడుకలకు ఏర్పాట్లు

Jun 2 2026 5:41 AM | Updated on Jun 2 2026 5:41 AM

ములుగు: నేటి రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను కలెక్టరేట్‌ ప్రాంగణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్‌ హేమంత్‌ సహదేవరావు తెలిపారు. కలెక్టరేట్‌లో నేడు(మంగళవారం)నిర్వహించనున్న వేడుకలకు రాష్ట్ర మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై ఉదయం 8 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరించనున్నట్లు వెల్లడించారు. అనంతరం పోలీసులతో మంత్రి సీతక్క గౌరవ వందనం స్వీకరించి ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారని పేర్కొన్నారు. వివిధ సంక్షేమ పథకాలపై వివరించనున్నట్లు తెలిపారు. వేడుకల నిర్వహణకు సంబంధించి తాగునీరు, విద్యుత్‌, ట్రాఫిక్‌ నియంత్రణ, భద్రత ఏర్పాట్లు సంబంధిత శాఖల అధికారులు చేపట్టినట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement