● మంత్రి సీతక్క
ములుగు రూరల్: పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారికి గుర్తింపు దక్కుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, సీ్త్ర–శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క అన్నారు. మండలంలోని ఇంచర్ల ఎంఆర్ గార్డెన్‌లో డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ ఆధ్వర్యంలో ఆదివారం ని ర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. కాంగ్రెస్ ప్ర భుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అర్హులకు అందించేలా పార్టీ నాయకులు కృషి చేయాలన్నా రు. పార్టీ బలోపేతానికి కృషి చేసిన వారికి తప్పకుండా న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. ఎన్నికలు, పార్టీ నిర్మాణంలో బూత్ ఏజెంట్ల వ్యవస్థ కీలకమని పేర్కొన్నారు. అనంతరం టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ ఆధ్వర్యంలో టీపీసీసీ డాక్టర్స్ సెల్, మెడికల్ వింగ్ ములుగు జిల్లా చైర్మన్‌గా మల్లంపల్లి మండలానికి చెందిన ఆనందపు రవిబాబును నియమించగా ఆయనను శాలువాలతో సన్మానించారు. ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడిగా ఇంచర్ల గ్రామానికి చెందిన మట్టెవాడ తిరుపతిని నియమించగా వారికి నియామకపత్రాలను అందించారు. ఇదిలా ఉండగా.. పేదలు సైతం కార్పొరేట్ వైద్యం పొందేందుకు సీఎంఆర్‌ఎఫ్ ఎంతగానో ఉపయోగపడుతుందని మంత్రి సీతక్క తెలిపారు. ఈ మేరకు పలువురు లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను అందించారు. అనంతరం కొత్తగూడ మండలం సాధిరెడ్డిపల్లికి చెందిన దివ్యాంగుడు పుల్సం రవికిరణ్‌కు మూడు చక్రాల వాహనం అందించారు. కార్యక్రమంలో గ్రంథాల య సంస్థ జిల్లా చైర్మన్ బానోత్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కల్యాణి పాల్గొన్నారు.


