పల్లెలో చిత్రీకరణ.. ప్రజల్లో ఆదరణ | - | Sakshi
Sakshi News home page

పల్లెలో చిత్రీకరణ.. ప్రజల్లో ఆదరణ

Jun 1 2026 7:17 AM | Updated on Jun 1 2026 7:17 AM

ఏటూరునాగారం: ప్రస్తుతం యువత చాలామంది జల్సాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చే సుకుంటున్నారు. చెడు వ్యసనాలతో కుటుంబ సభ్యులను సైతం ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కానీ.. ఏటూరునాగారం మండల కేంద్రానికి చెందిన ఈ యువకులు మాత్రం యువత ఎలా ఉండకూడదో వివరిస్తూ లఘుచిత్రాలను రూపొందించి ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నారు. వాళ్లే ఫన్నీ బాయ్స్‌ క్రియేటర్స్‌.. ఇన్‌స్ట్రాగామ్‌ వేదికగా రీల్స్‌తో ప్రాంభమైన వారి ప్రయాణం ప్రస్తుతం షార్ట్‌ ఫిల్మ్‌ తీసేవరకు చేరుకుంది. అందుబాటు ఉన్న వనరులతో చిత్రాలను తీస్తున్న వీరికి మండల కేంద్రానికి చెందిన కాకులమర్రి లక్ష్మీనర్సింహరావు ఇచ్చిన ఆర్థిక బలం అందించడంతో కెమెరాలు, ఇతర సామగ్రిని కొనుగోలు చేసుకుని మరింత ఉత్సాహంతో ముందుకెళ్తున్నారు. వారు నివాసముండే ప్రదేశాలతోపాటు సమీప అటవీ ప్రాంతంలోనే షూటింగ్‌ చేస్తూ తమ చిత్రాలను ప్రజలముందుకు విడుదల చేస్తూ మెప్పిస్తున్నారు.

ఇప్పటి వరకు పది చిత్రాల రూపకల్పన..

ఫన్నీ బాయ్స్‌ ఇప్పటి వరకు పొరపాటు, బంధం, విలువ, నమ్మకం, ఎగతాళి, నిర్లక్ష్యం, నిజ జీవితం, నష్టం, బానిసతోపాటు మే 31న కొత్త షార్ట్‌ఫీల్మ్‌ కర్మ ఫలం పేరుతో లఘుచిత్రాలను రూపొందించారు.

షార్ట్‌ ఫిల్మ్స్‌తో ఆకట్టుకుంటున్న యువకులు

ఫన్నీ బాయ్స్‌ పేరుతో చిత్రీకరణ

Advertisement
 
Advertisement
Advertisement