ఎస్‌ఎస్ తాడ్వాయి: మేడారం సమ్మక్క సారలమ్మలను రాష్ట్ర మంత్రి ధనసరి సీతక్క ఆదివారం దర్శించుకున్నారు. అమ్మవార్ల గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోవిందరాజు, పగిడిద్దరాజులకు పూజలు చేశారు. దేవాదాయ శాఖ అధికారులు, పూజారులు డోలు వాయిద్యాలతో గద్దెల వద్దకు మంత్రికి స్వాగతం పలికారు. అనంతరం మంత్రి సీతక్కకు పూజరులు అమ్మవార్ల ప్రసాదం అందించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ రేగ కల్యాణి, మండల అధ్యక్షుడు బొల్లు దేవేందర్, మేడారం జాతర మాజీ చైర్మన్ లచ్చు పటేల్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ పాక సాంబయ్య, పులి సంపత్, తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా.. కాల్వపల్లికి చెందిన ఉపాధ్యాయుడు బొదెబోయిన బుచ్చయ్య ఇటీవల మృతి చెందగా.. ఆదివారం జరిగిన పెద్దకర్మ కార్యక్రమానికి హాజరైన మంత్రి సీతక్క నివాళులర్పించారు. తునికాకు సేకరణ వెళ్లి ఇటీవల మృతి చెందిన పాయం సుచిత్ర కుటుంబ సభ్యులను సీతక్క పరామర్శించారు.


