ములుగు రూరల్: ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమాన్ని వేగంగా పూర్తిచేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్ నుంచి జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నుంచి వీసీకి ఇన్‌చార్జ్ ఆర్డీఓ ప్రతాప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛమైన ఓటరు జాబితా ప్రజాస్వామ్య వ్యవస్థకు బలమైన పునాది లాంటిదని తెలిపారు. అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాలో నమోదు అయ్యేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. బీఎల్‌ఓలు ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారమ్ పంపిణీ, సేకరణ చేపట్టాలని సూచించారు. ఓటర్లు ఎలక్షన్ కమిషన్ ఇంటిగ్రేటెడ్ నెట్‌వర్క్ ద్వారా ఆన్‌లైన్‌లో తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల ఏఈఆర్‌ఓలు, బీఎల్‌ఓలు, సూపర్‌వైజర్లు, ఎలక్షన్ తహసీల్దార్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
వీసీలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి


