ములుగు రూరల్: పంచాయతీలకు అధిక స్వేచ్ఛ, సొంత ఆదాయాన్ని పెంచుకునేలా వెసులుబాటు కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ శుక్రవారం జిల్లా సర్పంచ్‌ల ఫోరం ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి సీతక్క ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ల ఫోరం జిల్లా నాయకులు ఇంచర్ల సర్పంచ్ కుమార్‌గౌడ్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీలు తమ ఖాతాల్లోనే పంచాయతీ సొంత ఆదాయాన్ని ఉంచుకునేలా ప్రభుత్వం నిబంధనలు మార్చడం హర్షనీయమన్నారు. పంచాయతీ సిబ్బందికి ప్రతినెలా ఒకటవ తేదీన వేతనాలు ఇచ్చేలా ప్రభుత్వం రూ. 50 కోట్లు విడుదల చేస్తుందని హామీ ఇచ్చారని వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు కంచర్ల రఘు, దారావత్ సారయ్య, కరుణ సాగర్, పూలమ్మ, నాయకులు వంగ రవి యాదవ్, యాసం రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.


