ములుగు రూరల్: గర్భిణులు పౌష్టికాహారం తప్పనిసరిగా తీసుకోవాలని ములుగు ప్రాజెక్టు సీడీపీఓ శిరీష సూచించారు. జిల్లా కేంద్రంలోని యాదవనగర్ అంగన్‌వాడీ కేంద్రంలో ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీడీపీఓ మాట్లాడుతూ మహిళలు గర్భం దాల్చినప్పటి నుంచి పిల్లలు రెండేళ్ల వయస్సుకు వచ్చే వరకు తీసుకునే సంరక్షణ చర్యలపై వెయ్యి రోజుల ప్రాముఖ్యతను వెల్లడించారు. గర్భం దాల్చినప్పటి నుంచి కడుపులో బిడ్డ ఎదుగుదల, ప్రతినెలా బరువు, రక్త పరీక్షలు చేయించుకోవాలన్నారు. డెలివరీ అయిన తర్వాత అరగంట సమయంలో పుట్టిన బిడ్డకు తల్లి ముర్రుపాలను తాగించాలని సూచించారు. చిన్నారులకు ఆరు నెలల వరకు తల్లి పాలను మాత్రమే పట్టించాలని సూచించారు. పిల్ల లు ఏడు నుంచి 9 నెలల మధ్య స్వతహాగా కూర్చుంటారని వివరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గోనెల భరత్, అంగన్‌వాడీ టీచర్లు, బాలింతలు, గర్భిణులు తదితరులు పాల్గొన్నారు.
సీడీపీఓ శిరీష


