భూసారం పెంపు | - | Sakshi
Sakshi News home page

భూసారం పెంపు

May 29 2026 2:13 AM | Updated on May 29 2026 2:13 AM

రైతులు సద్వినియోగం చేసుకోవాలి

ములుగు రూరల్‌: రైతులు పంట పొలాల్లో భూసారం పెంచుకునేందుకు పచ్చిరొట్ట సాగు ఉపయోగకరంగా ఉంటుంది. దీంతో భూమి సారవంతంగా మారి అధిక దిగుబడి ఇస్తుంది. నేలలో సేంద్రియ పదార్థాలు పెరగడంతో పాటు నత్రజని స్థాయి సహజంగా అధికమవుతుంది. మట్టిలో సూక్ష్మ దాతువుల సంఖ్య పెరిగి భూమి సారవంతంగా మారేందుకు పట్చిరొట్ట సాగు రైతులకు అనువుగా ఉంటుంది. రసాయన ఎరువుల వినియోగం తగ్గి పెట్టుబడి ఖర్చులు ఆదా అవుతాయి. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు సేంద్రియ వ్యవసాయం సాగు చేసేందుకు ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి.

సాగు వివరాలు ఇలా..

జిల్లాలోని పది మండలాల పరిధిలో మొత్తం 86,768 మంది రైతులు 1,63,229 ఎకరాల్లో వివిధ రకాల పంటలను సాగుచేస్తున్నారు. జిల్లాలో అత్యధికంగా వరి పంటను 1,07,700 ఎకరాలలో సాగు చేయనుండగా పత్తి 28,600 ఎకరాలు, మొక్క జొన్న 11,329 ఎకరాలలో సాగు చేసే అవకాశం ఉంది. అలాగే జీలుగ 14,500 ఎకరాలు, జనుము 1,100 ఎకరాలలో సాగు చేయనున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు.

50 శాతం సబ్సిడీపై విత్తనాలు

రైతులకు వానాకాలం సీజన్‌లో పచ్చిరొట్ట సాగుకు విత్తనాలను వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో 50 శాతం సబ్సిడీతో అందించేందుకు సిద్ధం చేసింది. జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, రైతు ఆగ్రోస్‌ కేంద్రాలలో విత్తనాలను అందుబాటులో ఉంచారు. జీలుగా, జనుము, పిల్లి పెసర విత్తనాలు రైతులకు అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లాలోని ఎస్‌ఎస్‌ తాడ్వాయి, వాజేడు, వెంకటాపురం(కె) మండలాల్లోని పీఏసీఎస్‌ల్లో, మల్లంపల్లి, ములుగు, వెంకటాపురం(ఎం), లక్ష్మీదేవిపేట, ఏటూరునాగారం, మంగపేట, బట్టాయిగూడెం, పస్రా, రాంపూర్‌ రైతు ఆగ్రోస్‌ కేంద్రాలలో పచ్చిరొట్ట విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. రైతులు భూమి పత్రాలు సమర్పించి 50 శాతం సబ్సిడీతో విత్తనాలను కొనుగోలు చేసుకోవచ్చు. జీలుగ 1400 క్వింటాలు, జనుము 50 క్వింటాలు, పిల్లిపెసర 50 క్వింటాల విత్తనాలు అందుబాటులో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న పచ్చిరొట్ట విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. 50 శాతం సబ్సిడీతో అందిస్తుంది. పచ్చిరొట్ట సాగుతో భూ సారం పెరిగి పంట దిగుబడులు అధికంగా వస్తాయి. రైతులు నత్రజని ఎరువుల వినియోగం తగ్గించేందుకు వీలుగా ఉంటుంది. జిల్లాలోని అన్ని మండలాల్లో పచ్చిరొట్ట విత్తనాలు అందుబాటులో ఉన్నాయి.

– సురేశ్‌కుమార్‌, జిల్లా వ్యవసాయ అధికారి

మండలాల వారీగా అందుబాటులో ఉన్న విత్తనాల వివరాలు

మండలం కేంద్రం జీలుగ జనుము పిల్లిపెసర

(క్వింటాళ్లలో)

మల్లంపల్లి ఆగ్రోస్‌ 50.20 00 00

ములుగు ఆగ్రోస్‌ 184.20 22 00

వెంకటాపురం(ఎం) ఆగ్రోస్‌ 100.0 00 00

లక్ష్మీదేవిపేట ఆగ్రోస్‌ 100.00 00 00

ఏటూరునాగారం ఆగ్రోస్‌ 99.90 00 00

మంగపేట ఆగ్రోస్‌ 232.50 10 50

బుట్టాయిగూడెం ఆగ్రోస్‌ 30.00 00 00

ఎస్‌ఎస్‌తాడ్వాయి పీఏసీఎస్‌ 30.30 00 00

పస్రా రాంపూర్‌ ఆగ్రోస్‌ 324.20 00 00

వాజేడు పీఏసీఎస్‌ 99.90 09 00

వెంకటాపురం(కె) పీఏసీఎస్‌ 149.10 09 00

జనుము

పిల్లిపెసర

Advertisement
 
Advertisement
Advertisement