రామప్ప దేవాలయంలో సీవీఓ శశిధర్‌ రాజు | - | Sakshi
Sakshi News home page

రామప్ప దేవాలయంలో సీవీఓ శశిధర్‌ రాజు

May 29 2026 2:13 AM | Updated on May 29 2026 2:13 AM

వెంకటాపురం(ఎం): చారిత్రక రామప్ప దేవాలయాన్ని గురువారం తెలంగాణ సివిల్‌ సప్లయీస్‌ డిపార్ట్‌మెంట్‌ చీఫ్‌ విజిలెన్స్‌ ఆఫీసర్‌ (సీవీఓ) శశిధర్‌ రాజు కుటుంబ సమేతంగా సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామికి వారు పూజలు నిర్వహించగా ఆలయ పూ జారులు హరీశ్‌ శర్మ, ఉమా శంకర్‌లు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి టూరిజం గైడ్‌ తాడబోయిన వెంకటేశ్‌ వివరించగా రామప్ప శిల్పకళసంపద బాగుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వెంకటాపురం(ఎం)ఎస్సై చల్లా రాజు, టూరిస్ట్‌ పోలీసులు శ్రీకాంత్‌, భద్రు ఉన్నారు.

రాష్ట్రస్థాయి క్రీడాపోటీలకు ఎంపిక

ఏటూరునాగారం: జిల్లాలోని బండారుపల్లి గురుకుల పాఠశాలలో నిర్వహించిన అథ్లెటిక్స్‌ జిల్లా స్థాయి పోటీలలో మండల కేంద్రంలోని క్రీడా ప్రాంగణానికి చెందిన క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు కోచ్‌ పర్వతాల కుమారస్వామి తెలిపారు. స్టాండింగ్‌ జంప్‌లో అండర్‌ 14 విభాగంలో సంజన, 60 మీటర్ల పరుగు పందెంలో అండర్‌ 8లో వర్షిత, 100, 600 మీటర్ల పరుగు పందెంలో అండర్‌ 16 విభాగంలో సాయి రామ్‌ విజయం సాధించారు. షాట్‌పుట్‌ డిస్కస్‌ త్రోలో నందిని, వంద మీటర్ల పరుగుపందెంలో అండర్‌ 16 విభాగంలో భవాని, 600 మీటర్ల పరుగు పందెంలో హరిప్రియ ఎంపికై నట్లు తెలిపారు. వీరు హైదరాబాద్‌లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భవన, క్రీడాకారులు పాల్గొన్నారు.

ఈదురుగాలులు.. భారీవర్షం

మంగపేట: మండలంలో ఈదురుగాలులతో కూడిన భారీవర్షం గురువారం రాత్రి కురిసింది. రాత్రి 8గంటల వరకు భారీ గాలులు, చిరజల్లులతో ప్రారంభమైన వర్షం 9 గంటల వరకు మంగపేట, మల్లూరు, రాజుపేటతో పాటు తదితర గ్రామాల్లో ఒక మోస్తారు వర్షం కురిసింది. దీంతో సాయంత్రం వరకు వడగాలులతో ఇబ్బందులు పడిన ప్రజలు వర్షంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడడంతో ఉపశమనం పొందారు. గాలులతో కూడిన వర్షానికి రమణక్కపేట సమీపంలో భారీ వృక్షం రోడ్డుపై అడ్డంగా పడటంతో ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న ఎస్సై టీవీఆర్‌ సూరి వెంటనే సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని జేసీబీతో రోడ్డుపై అడ్డంగా పడి ఉన్న చెట్టును తొలిగించి రూట్‌ క్లియర్‌ చేశారు.

మోహన్‌కుమార్‌కు సేవారత్న అవార్డు

ములుగు రూరల్‌: నాయీబ్రాహ్మణ జన సంస్థ ఆధ్వర్యంలో అందించిన ప్రతిభా పురస్కారాలు –2026లో భాగంగా జిల్లా కేంద్రానికి చెందిన అన్నం మోహన్‌కుమాకు సేవారత్న అవార్డు అందుకున్నారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లోని బీసీ సాధికారిక సంస్థ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో నాయీ బ్రాహ్మణ జన సంస్థ అధ్యక్షుడు శ్రీధర్‌ మురహరి అవార్డును మోహన్‌కుమార్‌కు అందించి సన్మానించారు. ఈ సందర్భంగా మోహన్‌కుమార్‌ మాట్లాడుతూ నాయీబ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి పదేళ్లుగా పోరాటాలు చేస్తున్నందుకు గాను గుర్తింపుగా అవార్డు అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు సంఘం ఉపాధ్యక్షులు సుశీల్‌కుమార్‌, తెలంగాణ నాయీ బ్రాహ్మణ మహిళా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు దుర్గారాణి, సుబ్బయ్య, అశోక్‌కుమార్‌, రమేశ్‌, శివరాం, ప్రసాద్‌, సతీష్‌, సుమలత, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement