ములుగు రూరల్: పంట పొలాలలో వ్యర్థాలను కాల్చడం సరికాదని ఎస్సై ఉపేందర్‌రావు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రైతులు పంట వ్యర్థానాలను కాల్చుతున్న క్రమంలో పక్కన ఉన్న పంటలు, పైప్‌లైన్‌లు దగ్ధం కావడంతో తోటి రైతులు ఆర్థికంగా నష్టపోతారని అన్నారు. వ్యర్ధాలను కాల్చడం వల్ల భూమిలోని పంటలకు మేలు చేసే కీటకాలు చనిపోవడంతో భూసారం తగ్గిపోతుందని అన్నారు. రహదారుల పక్క పంటలను తలబెట్టడంతో పొగ కారణంగా వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందన్నారు. వ్యార్థాలను తగలపెట్టె వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ములుగు మండల పరిధిలో ఇప్పటికి రెండు కేసులు నమోదు అయ్యాయని తెలిపారు.


