ఐకేపీ కేంద్రాల్లో రైతుల అవస్థలు | - | Sakshi
Sakshi News home page

ఐకేపీ కేంద్రాల్లో రైతుల అవస్థలు

May 29 2026 2:13 AM | Updated on May 29 2026 2:13 AM

ఐకేపీ కేంద్రాల్లో రైతుల అవస్థలు

గోవిందరావుపేట: ఐకేపీ కేంద్రాల్లో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారని బీఆర్‌ఎస్‌ నాయకులు పేర్కొన్నారు. మండలంలోని పస్రా మొద్దులగూడెం గ్రామాల మధ్యలో ఉన్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను బీఆర్‌ఎస్‌ నాయకులు పరిశీలించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. గన్ని బ్యాగుల కొరత, లారీల సమస్యలతో రైతులు ధాన్యాన్ని రోడ్లపైనే ఆరబోసుకుంటూ అకాల వర్షాల భయంతో ఆందోళన చెందుతున్నారని తెలిపారు. లారీల కేటాయింపులో అక్రమాలు జరుగుతున్నాయని, మిల్లర్లు తేమ పేరుతో ధాన్యానికి కోత విధిస్తూ రైతులను నష్టపరుస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement