సేవాట్రస్ట్‌ ఆవిర్భావ దినోత్సవం | - | Sakshi
Sakshi News home page

సేవాట్రస్ట్‌ ఆవిర్భావ దినోత్సవం

May 29 2026 2:13 AM | Updated on May 29 2026 2:13 AM

సేవాట్రస్ట్‌ ఆవిర్భావ దినోత్సవం

మంగపేట: మండలంలోని దోమెడ పంచాయతీ పరిధిలోని గొత్తికోయగూడెంలో శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్‌ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆ సంస్థ చైర్మన్‌ బాడిష నాగరమేశ్‌ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ట్రస్ట్‌ స్థాపించి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా గూడెంలోని చిన్నారులతో కలిసి కేక్‌ కట్‌చేసి స్వీట్లు పంచారు. గూడెంలోని బడీడు పిల్లలు ప్రతి ఒక్కరు చదువుకోవాలని ఆకాక్షిస్తు చిన్నారులు, విద్యార్థులు దుస్తులు, పలకలు, నోట్‌బుక్‌లు, పెన్నులు, పెన్సిల్లు పంపిణీ చేశారు. కష్టాల్లో ప్రజలకు తొడు ఉంటూ ముందుకు సాగుతునన చైర్మన్‌ నాగరమేష్‌ను గ్రామస్తులు అభినందించి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు వైస్‌ చైర్మన్‌ బాడిష నవీన్‌, గ్రామస్తులు లక్ష్మయ్య, పుల్లారావు, సద్ధాం, నర్సింగరావు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement