వెంకటాపురం(కె): మండల కేంద్రలలోని శివాపురం వీధిలోని టెలిఫోన్ ఎక్సెజ్ సెంటర్‌లో పంచాయతీ అధికారులు ఏర్పాటు చేసిన చెత్త కుండిలో చెత్తను తొలగించక పోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పది రోజులుగా చెత్త కుండిలోని చెత్త ఉండడంతో దుర్వాసన వస్తుంది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చెత్తచెదారం పెరుకుపోయి దోమలకు అవాసాలుగా మారి వ్యాధుల బారిన పడుతున్నమని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెత్తను తొలగించాలని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి చెత్తను తొగించేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.


