సమాఖ్య భవన నిర్మాణాలు | - | Sakshi
Sakshi News home page

సమాఖ్య భవన నిర్మాణాలు

May 29 2026 2:13 AM | Updated on May 29 2026 2:13 AM

వాజేడు: మహిళా సమాఖ్య సమావేశాలు, కార్యకలాపాల నిర్వహణ కోసం వాజేడు మండలానికి 25 భవనాలు మంజూరయ్యాయి. తొలి విడతలో మూడు భవనాలు మంజూరు కాగా రెండవ విడతలో 22 భవనాలను మంజూరు చేశారు. భవన నిర్మాణ పనులను చేపట్టి భవనాలను పూర్తి చేస్తే మహిళా సమాఖ్య సభ్యులుపాటు సభలు, సమావేశాలను ఆ భవానాల్లోనే నిర్వహించుకోవచ్చు. ప్రతీ సారి తమ గ్రూపుల సంబంధించిన సమావేశాలను ఎక్కడో ఒక చోట నిర్వహించాల్సి వచ్చేది. ఈ భవనాలు పూర్తి అయితే మహిళలకు ఇబ్బందులు తొలగనున్నాయి. ఒక్కో దానికి రూ 10 లక్షలను వెచ్చించనున్నారు. ఈ భవనాల నిర్మాణానికి ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నుంచి నిధులను మంజూరు చేయనున్నారు. భవనాల నిర్మాణమ కోసం ఇప్పటికే గ్రామాల్లో సర్పంచ్‌లు శంకుస్థాపనలను చేశారు.

పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో నిర్మాణం

మహిళా సమాఖ్య భవనాల నిర్మాణాలను పంచా యతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో చేపట్టనున్నారు. భవ న నిర్మాణాలు మొత్తం పంచాయతీ రాజ్‌ శాఖ ఆధ్వర్యంలో జరుగనుండగా రెండు నెలల్లో పనులు పూ ర్తి కావాల్సి ఉంది. ఈ భవనాలు పూర్తి అయితే మహిళా సమాఖ్య సభ్యురాళ్లకు సమావేశాలు, సభలు, ప్రభుత్వం ద్వారా నిర్వహించే కార్యక్రమాలకు అనుకూలంగా ఉండనుంది. త్వరితగతిన పనులను పూ ర్తి చేసి భవనాలను నిర్మించగలిగితే మండలంలో మరో 25 ప్రభుత్వ భవనాలు ఉండనున్నాయి. మండలంలోని 13 గ్రామ పంచాయతీల్లో 25 భవనాలు మంజూరు కాగా నాలు పంచాయతీలకు భవనాలు మంజూరు కాలేదు. నాగారం 3, పేరూరు 1, ఏడ్జెర్లపల్లి 3, పూసూరు 1, మొరుమూరు 4, కొంగాల 2, దూలాపురం 1, చీకుపల్లి 1, గుమ్మడిదొడ్డి 3, చెరుకూరు 2, కృష్ణాపురం 2, అయ్యవారి పేట 1, చింతూరు 1 భవనం మంజూరయ్యాయి. టేకుల గూడెం కాలనీ, ధర్మవరం, పెద్ద గొళ్లగూడెం, చండ్రుపట్లలో ఒక్క భవనం కూడా మంజూరు కాలేదు.

ఒక్కో భవనానికి రూ.10 లక్షలు

ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ ద్వారా నిధులు మంజూరు

Advertisement
 
Advertisement
Advertisement