ఏటూరునాగారం: మండల కేంద్రంలోని ఈద్గా వద్ద ఉదయం 8 గంంటలకు జామ మసీద్ ఇమామ్ అబ్దుల్ రావుఫ్ ఆధ్వర్యంలో బక్రిద్ వేడుకలను భక్తి శ్రద్ధలతో చేపట్టారు. చిన్నా పెద్ద తేడా లేకుండా ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. జామా మసీదు అధ్యక్షుడు సయ్యద్ అఫ్జల్‌పాషాతోపాటు పెద్దలు రజాక్, మహబూబ్ హుస్సేన్, సులేమాన్, అన్వర్, ఆఫ్రీది, రహీమ్ పాల్గొన్నారు.
కన్నాయిగూడెం: మండలంలో బక్రీద్ వేడుకలను ముస్లిం నిర్వహించుకున్నారు. మండలంలోని ముప్పనపల్లి, లక్ష్మీపురం, గూర్రేవుల గ్రామాల్లోని ముస్లింలు ఈద్గులలో ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. మతపెద్దలు రియాజొద్దిన్ షాయక అలీమ్, వలిహేదర్, లతిఫ్ తదితరులు పాల్గొన్నారు.


