బోటులో షికారు.. హుషారు | - | Sakshi
Sakshi News home page

బోటులో షికారు.. హుషారు

May 29 2026 2:13 AM | Updated on May 29 2026 2:13 AM

టేకుమట్ల(కాళేశ్వరం): కాళేశ్వరం సరస్వతీ అంత్య పుష్కరాలకు వచ్చే భక్తులు గోదావరి ప్రవాహంలో బోటులో ప్రయాణించి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో వ్యక్తికి రూ.100ల చార్జీ వసూల్‌ చేయగా భక్తులు నిరంతరం గోదావరిలో హుషారుగా షికారు చేస్తూ కేరింతలు కొడుతున్నారు. గోదావరిలో సుమారు 10 నిమిషాల పాటు కొనసాగే బోటు ప్రయాణం కొత్త అనుభూతి అంటూ పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది బోటు ప్రయాణంలో నీటి అలలను తాకుతూ మైమరిచి పోతున్నారు.

ప్రత్యేక అనుభూతి....

కాళేశ్వరంలో ఆలయంతో పాటు, గోదావరిలో బోటు ప్రయాణం అనుభూతినిస్తుంది. నా కుటుంబంతో పుష్కరాలకు వచ్చి బోటు ప్రయాణం చేశా. నాతో పాటు నా కుటుంబ సభ్యులకు కొత్త అనుభూతి. బోటు ప్రయాణం చాలా ఇష్టం.

– చందు భక్తుడు, వరంగల్‌

గతంలో కంటే తక్కువే గిరాకీ

గోదావరిలో మొత్తం 8బోట్లు నడిపిస్తున్నాం. సరస్వతీ పుష్కరాల సందర్భంగా ఎంతో గిరాకీ ఉంటుందని ఆశించాం. రోజుకు కేవలం రూ.30 వేల నుంచి రూ.40వేలకు వరకు మాత్రమే గిరికి అవుతుంది. సాధారణ సమయంలో అ ంతకంటే ఎక్కువే గిరాకి అయిన రోజులున్నాయి. గో దావరి పుష్కరాల సమయంలో చాలా బాగా గిరాకి అ య్యేది. గతంతో పోల్చితే చాలా తక్కువ గిరాకీ అవుతుంది.

– మధు, బోట్‌ డ్రైవర్‌, కాళేశ్వరం

Advertisement
 
Advertisement
Advertisement