టేకుమట్ల(కాళేశ్వరం): శ్రీ సరస్వతీ అంత్య పుష్కరాలలో టిఫిన్ సెంటర్లకు గిరాకీ అంతంత మాత్రంగా ఉంది. పుష్కరాలకు వేలాదిగా భక్తులు తరలివస్తారని ఆశించి నూతనంగా కాళేశ్వరంలో ఏర్పాటు చేసుకున్న టిఫిన సెంటర్ నిర్వాహకులకు ఆశలుఆవిరి అయ్యాయి. సాధారణంగా ప్రధాన రోడు్‌డ్ సైడు ఏర్పాటు చేసుకున్న టిఫిన్ సెంటర్లకు సుమారుగా రూ.2వేల నుంచి రూ.5వేల వరకు గిరాకీ అవుతుంది. అదే పుష్కరాలకు వేలాదిగా తరలివస్తారని ఆశపడి టిఫిన్ సెంటర్లు నిర్వహిస్తే కొన్ని చోట్ల అంతంత మాత్రమే గిరాకి కాగా, మరి కొన్ని చోట మరీ అధ్వానంగా మారింది.
ఖర్చులు కూడా రావడం లేదు
పుష్కరాల ప్రారంభంలో సరస్వతీ పుష్కర ఘాట్ బస్టాండ్ వద్ద టిఫిన్ సెంటర్‌ను ఏర్పాటు చేసుకున్నాం. పుష్కరాల ప్రారంభం నుంచి అంతంతగానే గిరాకీ రావడంతో అక్కడి నుండి గోదావరిలో భక్తులు వచ్చే దారికి టిఫిన్ సెంటర్‌ను ఏర్పాటు చేసాం. ఇక్కడ గిరాకి మరీ దారుణంగా ఉంది. ఒక్కో రోజు కనీసం 5 ప్లేట్ల గిరాకీ కూడా కావడం లేదు. పిండి ఖర్చులు, నూనె, తదితర సామాను ఖర్చులు మేమే భరించాల్సి వస్తుంది.
– శైలజ, టిఫిన్ సెంటర్ నిర్వాహకురాలు, ఎడప్పలి
●


