మానవత్వం చాటిన ఎస్సై | - | Sakshi
Sakshi News home page

మానవత్వం చాటిన ఎస్సై

May 29 2026 2:13 AM | Updated on May 29 2026 2:13 AM

మానవత్వం చాటిన ఎస్సై

ములుగు రూరల్‌: పిడుసుతో పడిపోయిన మహిళను ఆస్పత్రికి తరలించి ఎస్సై చంద్రశేఖర్‌ మానవత్వాన్ని చాటుకున్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్‌ జిల్లా మనోహరబాద్‌ మండలకేంద్రానికి చెందిన ఠాకూర్‌ ఆశ(38) జిల్లాకేంద్రంలో తెలిసిన వారిని కలిసేందుకు వచ్చింది. ఈ క్రమంలో ఫోన్‌లో చార్జింగ్‌ లేకపోవడంతో కలెక్టర్‌ ఆఫీస్‌రోడ్డులో ఓ షాపులో చార్జింగ్‌ పెట్టి వేచి ఉంది. ఈ క్రమంలో పిడుసు వచ్చి పడిపోవడంతో దగ్గరలో ఉన్న ఎస్సై చంద్రశేఖర్‌ గమనించి వెంటనే అతడి వాహనంలో సిబ్బందితో కలిసి ములుగు జనరల్‌ ఆస్పత్రికి తరలించారు.

కేజీబీవీలో

అడ్మిషన్లు ప్రారంభం

మొగుళ్లపల్లి: మండలంలోని కొరికిశాల గ్రామంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో 2026–27 విద్యా సంవత్సరానికి గానూ ప్రవేశాలు ప్రారంభమైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ప్రత్యేకాధికారి ఆలూరి చైతన్య గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విద్యాలయంలో 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి అర్హులైన విద్యార్థినుల నుంచి దరఖాస్తులు ఆన్‌లైన్‌ నుంచి కోరుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

రేపు క్రీడాకారుల ఎంపిక

మొగుళ్లపల్లి: జిల్లా బాస్కెట్‌బాల్‌ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్న క్రీడలకు బాలబాలికల ఎంపిక ఈనెల 30న జిల్లాలోని దిఏవీ స్కూల్లో నిర్వహిస్తున్నట్లు బాస్కెట్‌బాల్‌ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సంఘీ చరత్‌ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 01–01–2010 తరువాత జన్మించిన వారు అర్హులని ఆసక్తి గల క్రీడాకారులు వారి వెంట ఆధార్‌, జనన ధ్రువీకరణ పత్రాలు తీసుకురాగలరని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement