చిట్యాల(కాళేశ్వరం): కాళేశ్వరలో నిర్వహిస్తున్న సరస్వతీ అంత్య పుష్కరాలకు విద్యుత్ అధికారులు నెల రోజుల ముందే విద్యుత్ ఏర్పాట్లుకు సన్నాహాలు ప్రారంభించి నిరంతరం విద్యుత్ సరాఫరా సంబంధిత అధికారుల పర్యవేక్షణలో అందిస్తున్నారు. ఈ క్రమంలో భక్తులకు ఏలాంటి ఇబ్బందులు కలుగకుండా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీధర్ బాబు, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిధులు కేటాయించి అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు తాత్కాలిక ఆర్టీసీ బస్టాండ్, పార్కింగ్ వద్ద, టెంట్ సీటీ, పుష్కరఘాట్ ప్రదేశాల్లో సుమారుగా 490 విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేశారు. అలాగే 15 విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు, 4 జనరేటర్లు ఏర్పాటు చేశారు. అలాగే విద్యుత్ ఏర్పాట్లలో ఏలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఉండేందుకు 140 మంది సిబ్బందిని కూడా నియమించారు.


