ములుగు రూరల్: మల్లంపల్లి మండల పరిధిలోని కోయగూడెం జెడ్పీహెచ్‌ఎస్‌లో ఏటూరునాగారానికి చెందిన గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయాలనే నిర్ణయాన్ని విరమించుకోవాలని విద్యా పరిరక్షణ కమిటీ జిల్లా అధ్యక్షుడు పల్లె నాగరాజు అన్నారు. ఈ సందర్భంగా బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం గురుకుల ఏర్పాటు పేరుతో ప్రభుత్వ పాఠశాలలను లేకుండా చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.తక్షణమే గురుకుల పాఠశాల, కళాశాలను ఏటూరునాగారం పరిసర ప్రాంతాల్లోనే కొనసాగించాలన్నారు. పాఠశాలల రక్షణ కోసం ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు రేగ నరేందర్, గన్‌రెడ్డి ఆదిరెడ్డి, ఉప్పస్వామి, దిలీప్, వైనాల స్వామి, సూర్య, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
ఉద్యాన పంటలతో
రైతులకు మేలు
ములుగు: ఉద్యాన పంటల సాగుతో రైతులకు మేలు చేకూరుతుందని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖ అధికారి సంజీవరావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో సాంప్రదాయ పంటలను పక్కనపెట్టి తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వచ్చే ఆయిల్‌పామ్, కూరగాయలు, పండ్లతోటలు, మిర్చి, పసుపు సాగు చేయాలని సూచించారు. జిల్లాలో 3,726 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు అవుతుందని తెలి పారు. ఈ పంటకు కోతుల బెడద, దొంగల బెడద ఉండదని తెలిపారు. చీడపురుగులు సైతం చాలా తక్కువగా ఆశిస్తాయన్నారు. ఆయిల్‌పామ్ సాగు చేసిన 4 ఏళ్లలో గెలల దిగుబడి వస్తుందని తెలిపారు. ఎండాకాలంలో వరి, మొక్కజొన్న పంటలను వేసి కోత కోసిన తర్వాత కొయ్య కాలు, మొక్కజొన్న సొప్పను కాల్చొద్దని తెలిపారు. వాటిని కాలిస్తే నష్టం అన్నారు. భూమి సారం తగ్గడం, గాలి కాలుష్యం పెరగడం, మనుషుల ఆరోగ్యం దెబ్బతింటుందని వివరించారు. ఎండు గడ్డిని, మొక్కజొన్న కొయ్య కాలును రోటవేటర్, కల్టివేటర్‌తో భూమిలో కలపాలని సూచించారు. 15నుంచి 20 రోజుల్లో వేస్ట్ డీకంపోజర్‌తో పిచికారీ చేస్తే వారంలో గడ్డి కుళ్లిపోయి ఎరువుగా మారుతుందని వెల్లడించారు.
ధాన్యం సేకరణ
వేగంగా చేపట్టాలి
మల్హర్(కాటారం): ధాన్యం సేకరణ పనులను వేగంగా చేపట్టాలని కాటారం ఆర్డీఓ రవీందర్ సంబంధిత అధికారులు ఆదేశించారు. బుధవారం మండలంలోని మీనాక్షి జిన్నింగ్ మిల్లును ఆర్డీఓ సందర్శంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 15వేల బ్యాగ్స్ (60వేల క్వింటాళ్ల) ధాన్యాన్ని మిల్లుకు తరలించినట్లు చెప్పారు. హమాలీల కొరతను దృష్టిలో ఉంచుకుని అదనపు కూలీలను నియమించి సేకరణ ప్రక్రియ వేగంవతం చేయాలని అన్నరు. అన్‌లోడింగ్‌కు ప్రస్తుతం పనిచేస్తున్న హమాలీలకు అదనంగా మరో 20 మంది కూలీలను అదనంగా నియంంచాలని పీఏసీఎస్ సీఈఓ సతీష్‌ను ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ నాగరాజు, పీఏసీఎసీ సిబ్బంది పాల్గొన్నారు.
ఇద్దరు అటవీశాఖ
అధికారుల సస్పెన్షన్
మహాముత్తారం: మండలంలోని పెగడపల్లి రేంజ్‌పరిధిలోని యత్నారం అటవీప్రాంతంలో కొన్ని రోజుల క్రితం అడవిదున్నగా అనుమానిస్తూ జంతువుని కాల్చి చంపిన విషయం తెల్సిందే. యత్నారం రహదారికి అతిసమీపంలోనే అడవిజంతువుని కాల్చిన ఆనవాళ్ల విషయం తెలిసినప్పటికీ కిందిస్థాయి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు సమాచారం. ఈ క్రమంలో ఆ ఘటనపై వివిధ పత్రికల్లో వార్త కథనాలు వెలువడగా చర్చనీయాంశమైంది. విషయం బయటకు రావడంతో కాళేశ్వరం జోన్ ఫ్లయింగ్ స్క్యాడ్ డీఎఫ్‌ఓ జోగేందర్ వన్యప్రాణి మృతిచెందిన స్థలానికి వెళ్లి విచారణ చేపట్టగా వేటగాళ్లు విద్యుత్ తీగలతో అడవి జంతువుని హతమార్చినట్లు తెలింది. అయితే ఈ విషయంపై దిద్దుబాటు చర్యల్లో భాగంగా యత్నారం అటవీశాఖ సెక్షన్ ఆఫీసర్ లక్ష్మణ్‌రావుతోపాటు పడమర బీట్‌అధికారి శ్రీతేజను సస్పెండ్ చేస్తూ మహాదేవపూర్ డివిజనల్ ఆఫీసర్ సందీప్‌రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు.
వేటగాళ్లపై ఉక్కుపాదం మోపేనా..?
మహాముత్తారం మండలం దట్టమైన అటవీప్రాంతం కావడంతో వేటగాళ్ల ఆకృత్యాలకి నిత్యం వన్యప్రాణులు బలవుతున్నాయి. వేటగాళ్ల అవతారమెత్తుతున్న కొందరు వ్యక్తులు విద్యుత్ తీగలు, ఉచ్చులతో జంతువులను బలితీసుకుంటున్నారు.


